Advertisement

  • హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతాయన్న అమెరికా శాస్త్రవేత్తలు

హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతాయన్న అమెరికా శాస్త్రవేత్తలు

By: chandrasekar Fri, 25 Sept 2020 08:49 AM

హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతాయన్న అమెరికా శాస్త్రవేత్తలు


కరోనాను నియంత్రించుటకు హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతాయని అమెరికా శాస్త్రవేత్తలు సూచించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి ఇంకా టీకా అందుబాటులోకి రాలేదు. అన్ని దేశాల శాస్త్రవేత్తలు దీనికోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే, హెర్డ్‌ ఇమ్యూనిటీ ద్వారా కొవిడ్‌ను నియంత్రణలోకి తేవచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఇది అసాధ్యమైన ప్రజారోగ్య వ్యూహమని తాజాగా, ఓ అధ్యయనంలో తేలింది.

కరోనా వైరస్ వ్యాపించిన వారిలో రోగనిరోధక శక్తి పరిపూర్ణంగా లేదని, హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. యూఎస్‌లోని జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. దీనికి టోబి బ్రెట్ అనే శాస్త్రవేత్త నాయకత్వం వహించారు. వారు యూకేలో సార్స్‌-సీఓవీ-2 ప్రసారాన్ని అనుకరించడానికి వయస్సు-స్తరీకరించిన వ్యాధి ప్రసార నమూనాను అభివృద్ధి చేశారు, రోగలక్షణ వ్యక్తుల స్వీయనిర్బంధం, వివిధస్థాయిల సామాజిక దూరం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అంచనా వేశారు.

యూకే లో హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తే ఏకంగా 4,10,000 మంది చనిపోతారని, అందులో 60 ఏళ్లపైబడినవారు 3,50,000 మంది ఉంటారని సైంటిస్టులు అంచనావేశారు. అదే లాక్‌డౌన్‌లాంటి నిర్బంధ చర్యలు పాటిస్తే చాలా తక్కువ మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. 60 ఏళ్ల పైబడినవారు 62,000 మంది, 60 ఏళ్లలోపు 43,000 మంది మాత్రమే చనిపోయే ప్రమాదం ఉందని తేల్చారు. ప్రజల స్వీయనిర్బంధంతోనే కరోనా కట్టడి సాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రజలు ఇళ్లకే పరిమితమైతే కరోనా వైరస్‌ వ్యాప్తి 70 శాతం తగ్గుతుందని గుర్తించారు.

ప్రజల సంచారం తగ్గించడంతో భౌతిక దూరంతో సంబంధం లేకుండా రెండునెలల్లో కరోనాను ఖతం చేయవచ్చని అంచనావేశారు. పాఠశాలలు, పని, సామాజిక సమావేశ స్థలాలను వెంటనే మూసేయాలని సూచించారు. హెర్డ్‌ ఇమ్యూనిటీకి ప్రయత్నిస్తే రోగులకు దవాఖానలు సరిపోవని హెచ్చరించారు. అందుకే ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తే దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మరణాల సంఖ్య తగ్గుతుందని, కరోనాను తరిమికొట్టవచ్చని అంటున్నారు. ఇమ్యూనిటీ పవర్‌గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు. రోగ నిరోధక శక్తీ పెంచుకోవడానికి మంచి పౌష్టిక ఆహరం తీసుకోవాలని సూచించారు.

Tags :

Advertisement