Advertisement

  • కరోనా వైరస్ కణాలను ఎలా అడ్డుకోవాలని గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ కణాలను ఎలా అడ్డుకోవాలని గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

By: chandrasekar Fri, 13 Nov 2020 10:40 AM

కరోనా వైరస్ కణాలను ఎలా అడ్డుకోవాలని గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చాలా తీవ్రంగా భయపెట్టి నాశనం చేసింది. ఈ కరోనా వైరస్ కణాలను ఎలా అడ్డుకోవాలని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించిన కీలక విషయం తెలిసింది. ఈ మహమ్మారి గుట్టు విప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు శ్రమిస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ఇది మానవ కణాల్లోకి ఎలా వెళ్తుంది? దాన్ని ఎలా అడ్డుకోవడం? అనే గుట్టును అమెరికా శాస్త్రవేత్తలు విప్పారు.

దీనివల్ల వైరస్ నుండి జాగ్రత్త పడవచ్చును. మానవ కణాల్లోకి ప్రవేశించి, తమ సంఖ్యను పెంచుకునేందుకు కరోనా వైరస్‌కు ఉపయోగపడే రెండు కీ ప్రొటీన్లను గుర్తించారు. వాటిని కాల్పైయిన్‌ ఇన్హిబిటర్‌ 2, కాల్పైయిన్‌ ఇన్హిబిటర్‌ 12 అనే పదార్థాలు సమర్థవంతంగా అడ్డుకుంటాయని కనుగొన్నారు. కరోనా వైరస్‌ (సార్స్‌ సీవోవీ-2) మల్టీ లెవల్‌లో మానవ శరీరంపై దాడిచేస్తుంది.

ఈ కరోనా వైరస్ మొదట ఊపిరితిత్తుల లోపల ఉండే కణాలపై దాడిచేస్తుంది. ఆ తర్వాత కణయంత్రాంగాన్ని స్వాధీనం చేసుకుని భారీగా తన ప్రతులను ఏర్పరుస్తుంది. కణంలోకి ప్రవేశించడానికి వైరస్‌కు లైజోజోమల్‌ ప్రొటీజ్‌ క్యాథెప్సిన్‌ ఎల్‌ అనే మానవ ప్రొటీన్‌, కణంలో తన ప్రతులను పెంచుకోవడంలో ఎంపీఆర్‌వో అనే వైరల్‌ ప్రొటీన్‌ను వైరస్‌ ఉపయోగించుకుంటుంది.

వీటిపై పరిశోధనలో ఇప్పటికే అందుబాటులో ఉన్న పదార్థాల్లో వీటిని అడ్డుకునే సామర్థ్యమున్న వాటిని తాము గుర్తించినట్లు సౌత్‌ ఫ్లోరిడా ఆరోగ్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త యు చెన్‌ తెలిపారు. వీటిని కాల్పైయిన్‌ ఇన్హిబిటర్స్‌ 2,12గా పిలుస్తున్నట్లు వివరించారు. దీంతో ఇక మానవ కణాల్లోకి కరోనా చేరకుండా చేయొచ్చని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. దీనివల్ల వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు.

Tags :
|

Advertisement