Advertisement

  • చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం ..ఇద్దరు మహిళలు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం ..ఇద్దరు మహిళలు మృతి

By: Sankar Wed, 30 Sept 2020 6:14 PM

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం ..ఇద్దరు మహిళలు మృతి


చిత్తూర్ జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. పంటపొలాలు నాశనం చేసిన ఏనుగు.. అక్కడ ఉన్న ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోనియా, రపల్లె పాపమ్మ పొలంలో పనులు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఏనుగు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. ఈ దాడిలో వారిద్దరూ మృతి చెందారు. అయితే మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. కాగా, ఇకపై గ్రామాల వైపు ఏనుగులు రాకుండా కంచెలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

చిత్తూర్ జిల్లాలో వరుసగా ఏనుగుల దాడులు జరుగుతున్నాయి..దీనితో వరుస ఘటనల మీద అటవీ అధికారులు రైతులకు, ప్రజలు పలు సూచనలు చేస్తున్నారు. ఏనుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరుస ఏనుగుల దాడులతో చేతికందిన పంటలు నష్టపోవడంతో రైతులు, గ్రామాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను బంధించాలని అటవీ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags :
|

Advertisement