Advertisement

  • తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులపై వీడని సందిగ్దత

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులపై వీడని సందిగ్దత

By: Sankar Tue, 25 Aug 2020 08:54 AM

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులపై వీడని సందిగ్దత


కరోనా కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి..అయితే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడవడంపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది.సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

ఏపీ ఆర్టీసీ అధికారులు తెలంగాణకు నడిపే సర్వీసులు, కి.మీ.ల వివరాలను టీఎస్‌ఆర్టీసీ అధికారులకు అందించారు. అయితే టీఎస్‌ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు.. లేని పక్షంలో కి.మీ.లను తగ్గించుకోవాలని ఏపీకి సూచించారు. ఈ సూచన ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని.. తర్వాత నిర్ణయం చెబుతామని ఏపీ అధికారులు అన్నారు..

తెలంగాణ బస్సులు ఏపీలో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే.. ఏపీ బస్సులు కూడా తెలంగాణలో అన్నే కిలోమీటర్లు తిరగాలని తెలంగాణ అధికారులు అన్నారు. దీనికి ఒప్పుకొంటే అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకుంటామన్నారు. ఏపీ అధికారులు కొంత వరకేబస్సులు తగ్గిస్తామన్నారు. దీనికి తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపటంపై మళ్లీ ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Tags :
|
|
|
|
|
|

Advertisement