Advertisement

  • భారత్ మరియు చైనా సరిహద్దులో ఉధ్రిక్తత ఓ సైనిక అధికారితో పాటు ఇద్దరు సైనికులు మృతి

భారత్ మరియు చైనా సరిహద్దులో ఉధ్రిక్తత ఓ సైనిక అధికారితో పాటు ఇద్దరు సైనికులు మృతి

By: chandrasekar Tue, 16 June 2020 4:04 PM

భారత్ మరియు చైనా సరిహద్దులో ఉధ్రిక్తత ఓ సైనిక అధికారితో పాటు ఇద్దరు సైనికులు మృతి


భారత్ మరియు చైనా సరిహద్దులో ఉధ్రిక్తతలో భాగంగా ఓ సైనిక అధికారి, ఇద్దరు సైనికులు ఆమరులైనట్లు తెలిసింది. గత కొంతకాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం మంగళవారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సరిహద్దులో భారత్‌ సైన్యంపై చైనా ఆర్మీ కాల్పులకు తెగబడింది. గాల్వాన్‌లోయ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు దిగింది. సరిహద్దు వివాదంలో ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఈశాన్యంలోని గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్‌, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరాటాలు జరుగుతున్నాయి.

సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందకు ఓవైపు ఇరు దేశాల దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నా భారత జవాన్లపై డ్రాగన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నిన్న రాత్రి లఢక్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో రెండు దేశాలూ సైన్యాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. అలా సైన్యం రెండు వైపులా వెళ్లిపోతున్న సమయంలో చైనా కవ్వింపు చర్యలకు దిగింది. దాంతో మన ఇండియన్ ఆర్మీ కూడా నువ్వో నేనో అని తలపడి పెద్ద గొడవే జరిగింది. రెండువైపులా రాళ్లు విసురుకున్నారని తెలిసింది. ఈ ఘటనలో భారత్ వైపు నుంచి ఓ సైనిక అధికారి, ఇద్దరు సైనికులు ఆమరులైనట్లు తెలిసింది.

ఈ హింసాత్మక కుట్ర తర్వాత రెండు దేశాల ఉన్నతాధికారులూ సైన్యాన్ని నెమ్మదించారు. దాంతో రెండు సైన్యాలూ వెనక్కి తగ్గాయి. ఇప్పుడీ అంశంపై రెండు దేశాల సీనియర్ మిలిటరీ అధికారులు సమావేశమై చర్చించుకుంటున్నారు. ప్రశాంతంగా వెనక్కి తగ్గాల్సిన సమయంలో మీ ఆర్మీ ఎందుకు రెచ్చగొట్టిందని అలా చెయ్యలేదు అని ఆర్మీ అధికారులు చర్చించుకుంటున్నారు. దీనిపై భారత ఆర్మీ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. నెల నుంచి చైనా ఈ నాటకాలు ఆడుతూనే ఉంది. లఢక్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి పెద్ద కుట్రే పన్నింది. పెద్ద ఎత్తున సరిహద్దుల్లో సైన్యాన్నీ, ఆయుధాల్నీ మోహరించింది. అంతేకాదు అక్కడ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించింది. ఇదంతా గమనించిన భారత్ కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడంతో చైనా ఆటలు సాగలేదు. అదే సమయంలో అమెరికా కూడా భారత్ వైపు నుంచి ఒత్తిడి చెయ్యడంతో చైనాకి తన ఆటలు సాగవని అర్థమైంది. ఆ సమయంలో కమాండర్ స్థాయి నేతలు రెండు వైపులా చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో రెండు దేశాల సైన్యాలూ సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లసాగాయి. అదే సమయంలో రాత్రి గాల్వన్ లోయలో చైనా ఈ కవ్వింపు చర్యలకు దిగి ఏకంగా మన సైన్యం ప్రాణాలు తీసింది. దీనిపై ఇప్పుడు భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు.

two soldiers,killed,military officer,border,india and china ,భారత్ మరియు చైనా, సరిహద్దులో, ఉధ్రిక్తత, ఓ సైనిక అధికారితో, పాటు ఇద్దరు సైనికులు మృతి


చైనా మరోసారి భారత్‌ను దొంగదెబ్బ కొట్టింది. ఒకవంక చర్చలు కొనసాగిస్తూనే మరోవంక దాడులకు పాల్పడుతోంది. తాజాగా మంగళవారం లఢక్ సమీపంలోని గాల్వన వ్యాలీ సమీపంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో భారత్‌కు చెందిన ముగ్గురు అమరులు అయ్యారు. మరణించిన వారిలో ఓ కమాండింగ్ అధికారి మరియు ఇద్దరు జవాన్లు ఉన్నారు. ఈ ఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్యంగా ఎలాంటి ముందుస్తు హెచ్చరికలు లేకుండా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటనను భారత ఆర్మీ ధృవీకరించింది. లఢక్ సెక్టార్ సమీపంలోని ఈశాన్య ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకం, సమస్యాత్మక ప్రాంతంగా భావించే గాల్వన్ వ్యాలీ సమీపంలో భారత్, చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ఆర్మీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ప్రస్తుతం భారత్ ప్రాణనష్టాన్ని చవి చూసిందని, ఇది దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించారు. ఓ కమాండింగ్ అధికారి సహా ఇద్దరు జవాన్లు అమరులు అయ్యారని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గాల్వన్ వ్యాలీ, పెట్రోలింగ్ పాయింట్ 15, హాట్ స్ప్రింగ్స్, ఫోర్ ఫింగర్స్ పాయింట్ వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. లఢక్ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ నెల 6వ తేదీన భారత్, చైనా మధ్య చర్చలు కొనసాగాయి. భారత్ తరఫున లేహ్‌లోని 14 కార్ప్స్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దక్షిణ గ్ఝిన్‌జియాంగ్ రీజీయన్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొన్నారు. మరి కొద్దిరోజుల్లో రెండో దఫా చర్చలు కొనసాగాల్సి ఉంది. అదే సమయంలో రెండు దేశాల సరిహద్దు సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం ముగ్గురు మరణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags :
|
|

Advertisement