Advertisement

  • ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం ..ఫ్లెక్సీ లు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి

ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం ..ఫ్లెక్సీ లు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి

By: Sankar Fri, 23 Oct 2020 11:23 AM

ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం ..ఫ్లెక్సీ లు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి


ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు పురస్కరించుకొని ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అభిమానులు మృతి చెందారు.

రెండు ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనూరులో నలుగురు అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ కు గురై వంకాయలపాటి సుగుణారావు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు గాయాలు కావడంతో వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు.

ఇక మరో పక్క ప.గో జిల్లాలోని కాళ్ల మండలంలో కూడా విషాదం చోటు చేసుకుంది. అక్కడ నలుగురు యువకులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తాకడంతో గండికోట దుర్గాప్రసాద్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మిగతా ముగ్గురు యువకులను స్థానిక ఆస్పత్రికి తరలించారు

Tags :
|
|

Advertisement