Advertisement

న్యూజీలాండ్ లో మళ్ళీ కరోనా కేసులు .

By: Sankar Tue, 16 June 2020 2:06 PM

న్యూజీలాండ్ లో మళ్ళీ కరోనా కేసులు .


కరోనా వైరస్‌పై పోరులో విజయం సాధించామని ప్ర‌క‌టించిన న్యూజిలాండ్‌లో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా, అక్కడ రెండు కేసులు నిర్దార్ధణ కావడంతో దేశం ఉలిక్కిపడింది. న్యూజిలాండ్‌లో మంగ‌ళ‌వారం కొత్తగా ఇద్దరికి వైరస్ నిర్ధారణ కాగా.. వీరు యూకే నుంచి వ‌చ్చినట్టు వైద్యాధికారులు ధ్రువీక‌రించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. బ్రిటన్ నుంచి వచ్చని ఇద్దరు మహిళలను క్వారంటైన్ కేంద్రంలో 24 రోజుల పాటు ఉంచిన తర్వాత ఇంటికి పంపారు.

ఇంటికి వెళ్లిన తర్వాత వీరికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆక్లాండ్‌లోని క్వారంటైన్ కేంద్రం నుంచి రాజధాని వెల్లింగ్టన్‌కు వెళ్లేందుకు ప్రభుత్వం వీరికి అనుమతి ఇచ్చారు. అయితే, క్వారంటైన్ కేంద్రం నుంచి వెళ్లడానికి ముందా? లేదా బయటకు వచ్చిన తర్వాత వారికి వైరస్ నిర్ధారణ అయ్యిందా? అనేది స్పష్టత లేదు. ఐసోలేషన్ పీరియడ్ ముగియడంతో వారిని బయటకు పంపినట్టు అధికారులు తెలిపారు.

అయితే, క‌రోనాను తాత్కాలికంగానే నిరోధించ‌గ‌లిగామ‌ని, దేశంలో మ‌ళ్లీ కేసులు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేక‌పోలేద‌ని గతంలోనే న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ వ్యాఖ్యానించారు. గ‌త 25 రోజులుగా వేలాది మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా ఒక్క కోవిడ్ కేసు కూడా న‌మోద‌కాలేదు. 50 ల‌క్ష‌ల జనాభా ఉన్న న్యూజిలాండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 1,500 మంది క‌రోనా బారిన ప‌డ‌గా 22 మంది మ‌ర‌ణించారు. మరోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 81 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి

Tags :
|
|
|

Advertisement