Advertisement

  • నిషేధిత స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

నిషేధిత స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

By: chandrasekar Sat, 12 Dec 2020 11:27 AM

నిషేధిత స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్


దేశంలో ఇప్పుడు ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడకం గణనీయంగా పెరిగింది. దీనిని గుర్తించి పలు అసాంఘిక చర్యలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు చర్య తీసుకుంటున్నారు. వీటి బారిన పడిన వారి కోసం హైదరాబాద్ మార్కెట్లో భారీగా స్టెరాయిడ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లుగా సమాచారం వచ్చింది.

దీంతో వెంటనే వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దుండగుల కోసం దాడులు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా స్టెరాయిడ్స్ అమ్మకాలపై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఏ1 షాప్‌లో స్టెరాయిడ్స్ అమ్మకాలు జరిగేటట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నిషేధిత స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.14 లక్షల విలువైన అధికమైన స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు.

స్టెరాయిడ్స్ ను పశువుల శారీరక వృద్ధి కోసం వినియోగించేవి. ఇవి అమ్మేటట్లు సమాచారం అందడంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దానిపై గట్టి నిఘా పెట్టారు. కానీ ఎక్కువగా స్టెరాయిడ్స్ అమ్మకాలు జిమ్‌లో కసరత్తు చేసేవారికి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్రమంగా విదేశాల నుంచి స్టెరాయిడ్స్ తెప్పించి ఈ అమ్మకాలు జరుగుతున్నట్లుగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఫోకస్‌లో తేలింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్‌ని ఏ1 షాపుపై దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ స్టెరాయిడ్స్ ను మనుషులు వాడడం వల్ల తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని చెపుతున్నారు. ఇకనైనా ఇలాంటి వాటి జోలికి పోకుండా ఉండాలని యువకులకు సూచనలు చేశారు.

Tags :

Advertisement