Advertisement

ఏలూరులో వింత వ్యాధికి మరో ఇద్దరు బలి...

By: chandrasekar Thu, 10 Dec 2020 9:34 PM

ఏలూరులో వింత వ్యాధికి మరో ఇద్దరు బలి...


ఏలూరు ఓ వింత వ్యాధికి ప్రజలు గురిఅవుతున్నారు. ఈ వ్యాధి వల్ల చాలా మంది ఆస్పత్రిలో చేరారు. ఈ వ్యాధికి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు వెళ్లిన వారిలో ఇద్దరు చనిపోయారు.మృతులు సుబ్బరావమ్మ, అప్పారావు వింత వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరినప్పటికీ వాళ్లు చనిపోవడానికి అసలు కారణం వేరే ఉందని వైద్యులు అంటున్నారు. ఈ ఇద్దరి మరణంతో ఏలూరు వింత వ్యాధి కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఏలూరులో వింత వ్యాధి కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు ఈ వింత వ్యాధికి సంబంధించి 592 కేసులు నమోదయ్యాయి. వీరిలో 511 మంది కోలుకున్నారు. అయితే ఏలూరు ప్రజలను ఈ వింత వ్యాధి ఎంతగానో భయపెడుతోంది. బుధవారం రాత్రి నుంచి కొత్త కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది.

ఎక్కడ తాము ఈ వింత వ్యాధి బారిన పడతామో అని బెంబేలెత్తిపోతున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ వ్యాధి అంత తీవ్రమైనది కాదని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం కారణంగానే వ్యాధి సోకి ఉండొచ్చని వైద్యలు, నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో ఏలూరు వాసులు తినడానికి తాగడానికి భయపడిపోతున్నారు. కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులను ఏలూరు వింత వ్యాధికి కచ్చితమైన కారణాలను కనుక్కోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వ్యాధి మూలాలను కచ్చితంగా కనుగొనాలని ఆదేశించారు. తుది నివేదికల ఆధారంగా పరిస్థితిని చక్కదిద్దేలా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రధానంగా తాగునీటి వల్ల అస్వస్థత వచ్చిందా.. లేదా? అనే విషయంపై దృష్టి సారించాలన్నారు. మిగిలిన అంశాలపై కూడా పరిశోధించాలని సూచించారు. ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

Tags :
|

Advertisement