Advertisement

  • ఈ రోజునుండి ఐపీల్ లో రెండు మ్యాచులు.. RR Vs RCB మరియు DD Vs KKR

ఈ రోజునుండి ఐపీల్ లో రెండు మ్యాచులు.. RR Vs RCB మరియు DD Vs KKR

By: chandrasekar Sat, 03 Oct 2020 11:38 AM

ఈ రోజునుండి ఐపీల్ లో రెండు మ్యాచులు.. RR vs RCB మరియు DD vs KKR


ఐపీల్ 2020 లో భాగంగా ఈ రోజునుండి ఐపీల్ లో రెండు మ్యాచులు జరగనున్నాయి. ఇందులో RR vs RCB మరియు DD vs KKR పోటీ పడనున్నాయి. రెండు వారాలుగా ఐపీఎల్​ను ఎంజాయ్​ చేస్తున్న ఫ్యాన్స్‌‌కు డబుల్‌‌ కిక్‌‌ లభించనుంది. ఇప్పటిదాకా రోజుకో మ్యాచ్​ చొప్పున ధనాధన్​ లీగ్​ను ఎంజాయ్​ చేసిన ఫ్యాన్స్ కోసం​ నాలుగు జట్లు రెడీ అవుతున్నాయి. ఐపీఎల్​ 13లో శనివారం తొలి డబుల్​ హెడర్​ జరగనుంది. ఫస్ట్ రాజస్తాన్​ రాయల్స్​– రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్– కోల్​కతా నైట్​రైడర్స్​ పరుగుల విందు అందించనున్నాయి. ఐపీఎల్​ 13లో మొత్తం పది డబుల్​ హెడర్లు ఉండగా ఈ వీకెండ్‌ నుంచి ఈ డబుల్​ ఫీస్ట్ స్టార్ట్​ అవ్వనుంది.​ రాజస్తాన్​ రాయల్స్​, రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు మధ్యాహ్నం అబుదాబిలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ లీగ్​లో ప్లేయర్లను మంచు ఇబ్బంది పెట్టగా ఇప్పుడు ఉక్కపోత సవాల్​ విసరనుంది. ఇదికాక షార్జా, దుబాయ్​తో పోలిస్తే అబుదాబిలోని షేక్​ జియెద్‌‌ స్టేడియం పెద్దది కావడం మరో చాలెంజ్.

ఇన్ని రోజులు ఒక్క మ్యాచ్ మాత్రమే ప్రతి రోజు నిర్వహించారు. ఈ రోజునుండి రెండు మ్యాచులు ఆడనున్నారు. లీగ్​లో ఇప్పటిదాకా మూడు మ్యాచ్​లాడిన ఇరుజట్లు చెరో రెండు విజయాలు సాధించాయి. వరుస విజయాలతో లీగ్​ను సూపర్​గా మొదలుపెట్టిన రాయల్స్ బుధవారం కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో తేలిపోయింది. దీంతో ఆ జట్టు కొంచెం ఒత్తిడిలో ఉంది. కెప్టెన్​ స్టీవ్​ స్మిత్, బట్లర్​, సంజూ శాంసన్​ మరోసారి బ్యాటింగ్​లో కీలకం కానున్నారు. వరుసగా ఫెయిలవుతున్న రాబిన్​ ఊతప్ప ప్లేస్​లో యశస్వి జైస్వాల్, బౌలర్లలో అంకిత్​ రాజ్​ఫుత్​ స్థానంలో వరుణ్​ ఆరోన్​ తుది జట్టులోకి రావొచ్చు. ఇక, ముంబై ​పై సూపర్​ ఓవర్​లో నెగ్గిన బెంగళూరు ఫుల్​ జోష్​లో ఉంది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫామ్​ తప్ప ఆ జట్టుకు పెద్దగా సమస్యల్లేవు. కోహ్లీ టచ్​లోకి వస్తే ఆర్​సీబీ వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఆల్​రౌండర్​ క్రిస్​ మోరిస్​ కూడా అందుబాటులోకి వస్తే జట్టు బలం పెరగనుంది. పెద్దగా ఊహించిన చెన్నై జట్టు వరుస అపజయాలతో వెనుకబడింది.

Tags :
|
|

Advertisement