Advertisement

  • పంట పొలాల్లో వజ్రాలను కనుగొన్న కార్మికులు ...రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిన వైనం

పంట పొలాల్లో వజ్రాలను కనుగొన్న కార్మికులు ...రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిన వైనం

By: Sankar Tue, 03 Nov 2020 4:27 PM

పంట పొలాల్లో వజ్రాలను కనుగొన్న కార్మికులు ...రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిన వైనం


మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని గనుల్లో కార్మికుల‌కు విలువైన వ‌జ్రాలు దొరికాయి. 7.44 అదేవిధంగా 14.98 క్యారెట్ల బరువున్న రెండు వజ్రాలను ఇద్ద‌రు కార్మికులు వెలికితీసిన‌ట్లు ఓ అధికారి మంగళవారం తెలిపారు.

దిలీప్ మిస్ర్తీ అనే కార్మికుడు జ‌రువపూర్ ప్రాంతంలో 7.44 క్యారెట్ రాయిని క‌నుగొన‌గా ల‌ఖ‌న్ యాద‌వ్ అనే మ‌రో కార్మికుడు కృష్ణ క‌ల్యాన్‌పుర్ ప్రాంతంలో 14.98 క్యారెట్ రాయిని క‌నుగొన్న‌ట్లు డైమండ్ ఇన్‌స్పెక్ట‌ర్ అనుప‌మ్ సింగ్ వెల్ల‌డించారు. ఈ రాళ్లను సోమవారం డైమండ్ కార్యాలయంలో జమ చేసి వేలం వేయనున్నట్లు స‌ద‌రు అధికారి తెలిపారు. వేలంలో ప‌లికిన ధ‌ర‌లో 12.5 శాతాన్ని రాయల్టీగా మిన‌హాయించుకుని మిగిలిన మొత్తాన్ని స‌ద‌రు కార్మికుల‌కు అందించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

వజ్రాలకు సంబంధించిన‌ ఖచ్చితమైన విలువను అధికారులు నిర్ణయించ‌నున్న‌ట్లు తెలిపారు. 7.44 క్యారెట్ల బరువున్న రాయికి రూ. 30 లక్షలు లభించనున్న‌ట్లు అదేవిధంగా దీనికంటే పెద్ద‌దైన రాయికి రెట్టింపు ధర ప‌ల‌క‌నున్న‌ట్లు చెప్పారు. త‌మ శ్ర‌మ ఫ‌లించి డైమండ్ల‌ను క‌నుగొన్నందుకు కార్మికులు ఇరువురు ఆశ్య‌ర్యచ‌కితుల‌య్యారు. ల‌ఖ‌న్ యాద‌వ్‌కు రెండు ఎకరాల భూమి ఉంది. ఇత‌నికి ఇది మొదటి వజ్రాల వెలికితీత. వ‌చ్చిన డ‌బ్బుతో త‌న పిల్ల‌ల‌ను మంచిగా చ‌దివించుకోనున్న‌ట్లు చెప్పాడు

Tags :

Advertisement