Advertisement

  • రైతు సంఘాలతో మరొకసారి అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు

రైతు సంఘాలతో మరొకసారి అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు

By: Sankar Wed, 30 Dec 2020 8:12 PM

రైతు సంఘాలతో మరొకసారి అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు


రైతు సంఘాలతో బుధవారం కేంద్రం​ జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సుమారు 5 గంటలకుపైగా కొనసాగిన చర్చల్లో సాగు చట్టాల రద్దు అంశాలు ఎలాంటి కొలిక్కి రాలేదు.

కాగా జనవరి 4న మరోసారి కేంద్రంతో రైతు సంఘాలు చర్చలు జరిపే అవకాశం ఉంది. కాగా మద్దతు ధర విషయంపై కమిటీ ఏర్పాటు చేసే యోచనను కేంద్రం పరిశీలిస్తుంది. వాయుకాలుష్య ఆర్డినెన్స్‌లో సవరణలకు సముఖత వ్యక్తం చేయడంతో పాటు విద్యుత్‌ బిల్లులో రైతులు సూచించిన సవరణలకు కేంద్రం మొగ్గుచూపింది.

ఇదే విషయమై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ.. రెండు అంశాలపై రైతు సంఘాలతో అంగీకారానికి వచ్చామన్నారు. రైతు సంఘాలతో జరిగిన చర్చల్లో పురోగతి కనిపించిందన్నారు. కొత్త చట్టాల పై కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని .. కొత్త ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నామన్నారు. కేంద్ర జరిపిన చర్చలు కాస్త సానుకూల ధోరణిలోనే సాగాయని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు

Tags :
|

Advertisement