Advertisement

  • ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చిత్తడి నేలలోకి పడి మృత్యువాత పడ్డారు

ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చిత్తడి నేలలోకి పడి మృత్యువాత పడ్డారు

By: chandrasekar Thu, 11 June 2020 8:30 PM

ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చిత్తడి నేలలోకి పడి మృత్యువాత పడ్డారు


విశాఖ గ్యాస్ లీకేజీ మరణఘోష ఇంకా కొనసాగుతుండగానే దేశంలో మరిన్ని లీకేసీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అస్సాంలో చమురుబావి పైప్ లైన్ లీకై భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చిత్తడి నేలలోకి దూకి చనిపోయారు. తీన్సుకియా జిల్లాలో బాజేగాన్ ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కంపెనికి చెందిన బాగేజన్ చమురు బావికి చెందిన పైప్ లైన్ గత నెల 27న లీకైంది. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాలను వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మంగళవారం ఆయిల్ లీక్ స్థాయి పెరిగి మంటలు లేచాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి యత్నించారు. వారిలో ఇద్దరు ఓఎన్జీసీ ఫైర్‌మెన్లు మంటల నుంచి తప్పించుకునే క్రమంలో చిత్తడినేలలో పడిపోయారు. ఎలా చనిపోయారో తమకు తెలియడం లేదని, పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు తెలిపారు. ఒకటిన్నర కిలోమీటరు పరిధిలోమంటలు ఎగసిపడుతున్నాయని, వాటిని ఆర్పేందుకు సింగపూర్ నిపుణులను రప్పిస్తున్నామని వెల్లడించారు.


Tags :
|
|

Advertisement