Advertisement

  • 151 నదుల నుంచి అయోధ్య రామ మందిరానికి నీటిని సేకరించిన సోదరులు

151 నదుల నుంచి అయోధ్య రామ మందిరానికి నీటిని సేకరించిన సోదరులు

By: Sankar Sun, 02 Aug 2020 10:17 PM

151 నదుల నుంచి అయోధ్య రామ మందిరానికి నీటిని సేకరించిన సోదరులు



అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్‌ 5 ప్రారంభించనున్నారు. అయితే 70ఏళ్లు కలిగిన ఇద్దరు సోదరులు రాధే శ్యామ్ పాండే, షాబ్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫాల తమ రామభక్తిని చాటుకున్నారు. వీరు 1968 నుంచి శ్రీలంకలోని పదహారు ప్రదేశాలు, ఎనిమిది నదులు, మూడు సముద్రాల ద్వారా రామమందిర నిర్మాణానికి నీటిని సేకరించారు. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధే శ్యామ్ పాండే స్పందిస్తు.. రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి భారత్‌, శ్రీలంక నదుల నుంచి నీటిని సేకరించడం తన కల అని రాధే శ్యామ్ తెలిపారు.

రాముడి అనుగ్రహంతోనే తన లక్ష్యం నెరవేరిందని తెలిపారు. ఓవరాల్‌గా 151 నదులు, అందులో 8 పెద్ద నదులు, 3 సముద్రాల నుండి రామమందిర నిర్మాణానికి నీటిని సేకరించామని అన్నారు. ఇక శ్రీలంకలోని 16 చోట్ల నుంచి మట్టిని కూడా సేకరించినట్లు పేర్కొన్నాడు.

దీన్ని కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నట్లు ఆ సోదరులు తెలిపారు. 1968 నుంచి 2019వరకు వివిధ మార్గాల ద్వారా నీటిని సేకరించామన్నారు. కాలినడకన, సైకిల్‌, రైలు, విమానం ఇలా అనేక మార్గాల్లో నీటిని, మట్టిని సేకరించడానికి వెళ్లినట్లు తెలిపారు. మందిర నిర్మాణ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు

Tags :
|

Advertisement