Advertisement

  • అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి ట్విట్ట‌ర్ సంస్థ వార్నింగ్

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి ట్విట్ట‌ర్ సంస్థ వార్నింగ్

By: chandrasekar Thu, 28 May 2020 3:42 PM

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి ట్విట్ట‌ర్ సంస్థ వార్నింగ్


అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి ట్విట్ట‌ర్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చేసిన ట్వీట్ అంద‌ర్నీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు ఆ సంస్థ త‌న వార్నింగ్‌లో పేర్కొన్న‌ది. మెయిల్ బ్యాలెట్ల‌తో ఫ్రాడ్ జ‌రుగుతుంద‌ని ట్రంప్ చేసిన ట్వీట్స్‌‌ను మైక్రోబ్లాగింగ్‌, సోష‌ల్ నెట్విర్కింగ్ స‌ర్వీస్‌ ట్విట్ట‌ర్ సంస్థ త‌ప్పుప‌ట్టింది.

మెయిల్ బ్యాలెట్ల ట్వీట్లు రెండింటికి ఆ సంస్థ వార్నింగ్ లేబుల్ ఇచ్చింది. కొత్త పాల‌సీ ప్ర‌కారం ట్విట్ట‌ర్ ఆ హెచ్చ‌రిక చేసింది. ట్విట్ట‌ర్ సంస్థ చేసిన వార్నింగ్ ప‌ట్ల ఆ త‌ర్వాత ట్రంప్ కూడా స్పందించారు. భావ‌స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డ‌మే అంటూ ట్విట్ట‌ర్ సంస్థ‌పై ట్రంప్ ఫైర్ అయ్యారు.

twitter,warns,us president,donald trump,first time ,అమెరికా, అధ్య‌క్షుడు, డోనాల్డ్ ట్రంప్‌కు, తొలిసారి, ట్విట్ట‌ర్ సంస్థ వార్నింగ్


ట్రంప్ చేసిన ట్వీట్ల కింద బ్లూమార్క్ చేశారు. వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని ఆ హెచ్చ‌రిక‌ల్లో రాశారు.

ఎవ‌రైనా తప్పుడు స‌మాచారం కానీ, త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారం కానీ పోస్టు చేస్తే, వారికి వార్నింగ్ ఇచ్చే విధంగా ట్విట్ట‌ర్ కొత్త మార్పులు తీసుకువ‌చ్చింది. నెల క్రిత‌మే వార్నింగ్‌ల‌కు సంబంధించి ట్విట్ట‌ర్ కొత్త విధానాన్ని తీసుకువ‌చ్చింది. ఈ ఏడాది నవంబ‌ర్ 3న జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విట్ట‌ర్ సంస్థ జోక్యం చేసుకుంటున్న‌ట్లు ట్రంప్ ఆరోపించారు.

Tags :
|

Advertisement