Advertisement

  • వెస్ట్ బెంగాల్ లో బీజేపీ , ప్రశాంత్ కిషోర్ మధ్య ట్వీట్ల యుద్ధం...

వెస్ట్ బెంగాల్ లో బీజేపీ , ప్రశాంత్ కిషోర్ మధ్య ట్వీట్ల యుద్ధం...

By: Sankar Tue, 22 Dec 2020 8:23 PM

వెస్ట్ బెంగాల్ లో బీజేపీ , ప్రశాంత్ కిషోర్ మధ్య ట్వీట్ల యుద్ధం...


పశ్చిమ బెంగాల్ లో రాజకీయ నాయకుల మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతుంది..ఎలాగయినా ఈసారి ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ లో పాగావేయాలని బీజేపీ భావిస్తుంది..అందుకోసం అన్ని అస్త్రాలను సిద్దము చేసుకుంటుంది..ఇక మరోవైపు ముందునుంచి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ అధికారం నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది..

ఈ క్రమంలోనే మమతకు అండగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ రంగంలోకి దిగారు. బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని సవాలు విసురుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం సింగిల్‌ డిజిట్‌ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అమిత్‌ షా ప్రచారం చేస్తున్నట్లు 200 సీట్లు సాధిస్తే తాను నిర్వర్తిస్తున్న విధుల నుంచి శాశ్వతంగా వైదులుతానని స్పష్టం చేశారు..

ప్రశాంత్‌ సవాల్‌ అనంతరం బీజేపీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో ఇరు పక్షాల మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌కు స్పందించిన బీజేపీ నేత కైలాష్‌ విజయ వర్గీయ.. దేశం త్వరలోనే ఓ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సేవలను కోల్పోనుందని కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ సృష్టించబోయే సునామీలో ఆ పార్టీ నేతలంతా కొట్టుకుపోడడం ఖాయమన్నారు. దీనికి బందులుగా స్పందించిన ప్రశాంత్‌.. 100 సీట్లు సాధించకపోతే మీరు (బీజేపీ నేతలు) అనుభవిస్తున్న పదవుల నుంచి తప్పుకునే దమ్ముందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు...

Tags :

Advertisement