Advertisement

  • కరోనా వైరస్ వ్యాక్సినేష‌న్ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించిన టర్కీ... ఈ నెల 11వ తేదీ త‌ర్వాత...

కరోనా వైరస్ వ్యాక్సినేష‌న్ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించిన టర్కీ... ఈ నెల 11వ తేదీ త‌ర్వాత...

By: chandrasekar Fri, 04 Dec 2020 5:28 PM

కరోనా వైరస్ వ్యాక్సినేష‌న్ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించిన టర్కీ... ఈ నెల 11వ తేదీ త‌ర్వాత...


ప్రపంచవ్యాప్తంగా వివిధ దశల్లో కరోనా టీకా ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతుతం కరోనా వైరస్ కోసం ట‌ర్కీ దేశం వ్యాక్సినేష‌న్ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించింది. దేశ ప్ర‌జ‌ల‌కు ఈనెల 11వ తేదీ త‌ర్వాత కోవిడ్ టీకాను ఇవ్వ‌నున్న‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ మంత్రి ఫ‌రెట్టిన్ కోకా తెలిపారు. తొలుత హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు ఆ టీకా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. చైనా కంపెనీ త‌యారు చేస్తున్న క‌రోనావాక్ టీకాను ట‌ర్కీ కొనుగోలు చేసింది. ఈ టీకాను ప్రజలకు అందివ్వనున్నారు.

చైనా నుండి కొనుగోలు చేసిన సుమారు కోటి డోసులు టీకాల‌ను డిసెంబ‌ర్‌లోనే ఇవ్వ‌నున్నామ‌ని, ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో మ‌రో కోటి డోసులు పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. చైనా వ‌ద్ద 5 కోట్ల డోసులు కొనేందుకు ట‌ర్కీ ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకున్న‌ది. కానీ ప్ర‌జ‌ల‌కు ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు. అయితే ఇత‌ర దేశాల‌కు చెందిన టీకాల‌ను ఫార్మ‌సీల్లో అమ్మేందుకు కూడా ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. జర్మ‌నీ వ‌ద్ద 2.5 కోట్ల కోవిడ్ టీకా డోసులు ఖ‌రీదు చేసేందుకు ప్లాన్ చేశామని ట‌ర్కీ మంత్రి తెలియజేసారు.

ఈ దేశంలో వాక్సిన్ ట్రయల్స్ కోసం చైనాకు చెందిన సైనోవాక్‌, అమెరికాకు చెందిన ఫైజ‌ర్ కంపెనీలు నిర్వ‌హిస్తున్నాయి. సైనోవాక్ టీకా మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌ను సెప్టెంబ‌ర్‌లోనే ప్రారంభంచారు. ఇప్ప‌టికే వేలాది మంది వాలంటీర్లు ఆ టీకా తీసుకున్నారు. ఫైజ‌ర్ కూడా ట‌ర్కీలో ట్ర‌య‌ల్స్ చేసింది. వాలంటీర్ల‌లో 98 శాతం యాంటీబాడీలు అభివృద్ధి చెందిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. త్వరగా వాక్సినేషన్ ప్రారంభించడం వల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తెలిపారు.

Tags :
|
|

Advertisement