Advertisement

  • టీటీడీ లో పోర్న్ లింక్ కలకలం కేసులో అయిదుగురిని ఉద్యోగం నుంచి తీసివేత

టీటీడీ లో పోర్న్ లింక్ కలకలం కేసులో అయిదుగురిని ఉద్యోగం నుంచి తీసివేత

By: Sankar Mon, 14 Dec 2020 9:20 PM

టీటీడీ లో పోర్న్ లింక్ కలకలం కేసులో అయిదుగురిని ఉద్యోగం నుంచి తీసివేత


భక్తుడికి పోర్న్‌ వీడియో లింక్‌ పంపిన కేసుకు సంబంధించి ఐదుగురు శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానల్‌ ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది. ఆ ఐదుగురిని ఉద్యోగంలోంచి తొలగించింది.

వారితో పాటు మరో నలుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక మేరకు టీటీడీ చర్యలు తీసుకుంది. కాగా, కొద్దిరోజుల క్రితం శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీ ఛానెల్‌కు ఓ భక్తుడు మెయిల్ చేశాడు.

ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలకు బదులు పొరపాటున అశ్లీల వెబ్‌సైట్ లింక్‌ను పంపించాడు ఓ ఎస్వీబీసీ ఉద్యోగి. సదరు భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈఓకి ఫిర్యాదు చేశాడు. విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని కూడా గుర్తించి వారిపై చర్యలకు సిద్ధమయ్యారు.

Tags :
|

Advertisement