Advertisement

  • ఆన్‌లైన్లో శ్రీవారి క‌ళ్యాణం - ఇంటికి ప్ర‌సాదాలు

ఆన్‌లైన్లో శ్రీవారి క‌ళ్యాణం - ఇంటికి ప్ర‌సాదాలు

By: Dimple Fri, 07 Aug 2020 5:04 PM

ఆన్‌లైన్లో శ్రీవారి క‌ళ్యాణం - ఇంటికి ప్ర‌సాదాలు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. తిరుమ‌ల‌లో రోజూనిర్వ‌హించే శ్రీవారి క‌ళ్యాణోత్స‌వంలో భ‌క్తులు పాలుపంచుకోక‌పోయిన‌ప్ప‌టికీ... ఆన్‌లైన్లో క‌ళ్యాణోత్స‌వ ఘ‌ట్టాన్ని తిల‌కించే అవ‌కాశం క‌ల్పించ‌డంతోపాటు... స్వామివారి క‌ళ్యాణోత్స‌వ ప్ర‌సాదాల‌ను, ఉత్త‌రీయాన్ని టిక్కెట్లు కొనుగోలు చేసిన భ‌క్తుల ఇళ్ల‌కు పంపాల‌ని నిర్ణ‌యించారు.

ఆన్ లైన్‌లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఇక‌నుంచి ప్ర‌తినెలా ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న క‌ళ్యాణోత్స‌వ టిక్కెట్ల‌ను ఆన్‌లైన్లో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. క‌రోనా ప్ర‌భావంతో భౌతిక దూరం పాటించాల‌నే నిబంధ‌న‌తో క‌ళ్యాణోత్స‌వానికి హాజ‌రుకాకుండానే... ఆన్‌లైన్లో తిల‌కించ‌వ‌చ్చు... స్వామి వారిప్ర‌సాదాల‌ను మాత్రం క‌ళ్యాణోత్స‌వ టిక్కెట్ల‌ను కొనుగోలు చేసిన భ‌క్తుల ఇళ్ల‌కే పంపిస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థాన అధికారిక వెబ్‌ సైట్‌లో రిజిష్టర్‌ చేసుకుని కళ్యాణోత్సవ టిక్కెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభమవుతుంది. మొదట పది నిముషాలు టిక్కెట్లు కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పిస్తారు. ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ అధికారులు తెలిపారు. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తులకు పంపనున్నారు. లాక్‌డౌన్, కరోనా ప్రభావంతో కళ్యాణోత్సంకు భక్తులు దూరమయ్యారు. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Tags :
|

Advertisement