Advertisement

  • నెలాఖరు వరకూ శ్రీవారి భక్తుల సంఖ్యను పెంచకూడదని టీటీడీ నిర్ణయం

నెలాఖరు వరకూ శ్రీవారి భక్తుల సంఖ్యను పెంచకూడదని టీటీడీ నిర్ణయం

By: chandrasekar Mon, 06 July 2020 5:21 PM

నెలాఖరు వరకూ శ్రీవారి భక్తుల సంఖ్యను పెంచకూడదని టీటీడీ నిర్ణయం


దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో తిరుమల శ్రీవారి భక్తుల సంఖ్యను పెంచకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుందని సాక్షి కథనం ప్రచురించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి రోజువారీ భక్తుల సంఖ్యను ఈ నెలాఖరు వరకు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా జూన్‌8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించామని ఆయన చెబుతూ ఇంతవరకు స్వామి దర్శనానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడికీ కరోనా పాజిటివ్‌రాలేదని స్పష్టం చేశారు.

టీటీడీ ఆర్థిక వనరులు పెంచుకోవడానికే రోజువారీగా భక్తుల దర్శనాల సంఖ్యను పెంచుతూ పోతోందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదని ఆయన చెప్పారు. ఎక్కువమంది స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందితే కరోనా త్వరగా దూరమవుతుందనే ఉద్దేశంతోనే దర్శనం టికెట్లను పెంచామని ఆయన చెప్పినట్లు సాక్షి చెప్పింది.

ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నా టీటీడీలో 17 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌వచ్చింది. వీరుంటున్న నివాస ప్రాంతాల్లోని పరిస్థితుల వల్లే కరోనా వచ్చిందని నిర్ధారణైంది. వీరందరినీ క్వారంటైన్‌కు అత్యుత్తమ వైద్యసేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్లు పత్రిక రాసింది.

Tags :

Advertisement