Advertisement

  • తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కు కొత్త చైర్మన్

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కు కొత్త చైర్మన్

By: Sankar Tue, 15 Dec 2020 12:45 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కు కొత్త చైర్మన్


తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది..దీనితో ఉద్యోగాలకోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ అయితే నోటిఫికెషన్స్ రిలీజ్ చేయాల్సింది మాత్రం టీఎస్‌పీఎస్సీ..అయితే ఈ నెల పదిహేడున టీఎస్‌పీఎస్సీ చైర్మన్ తో పాటు మరో ముగ్గురు సభ్యుల పదవీకాలం ముగియనుంది..

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీకి టీఎస్‌పీఎస్సీలో కోరం ఉండాల్సిందే. కమిషన్‌ చైర్మన్‌తో పాటు కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలి. కానీ ఈ నెల 17 తర్వాత కమిషన్‌లో ఇద్దరే మిగులుతారు. కాబట్టి కొత్త చైర్మన్‌తో పాటు కనీసం ఒక సభ్యుడిని ప్రభుత్వం వీలైనంత త్వరగా నియమిస్తేనే ఉద్యోగ ప్రకటనల జారీకి ఇబ్బందులు ఉండవు.

రాజ్యాంగం ప్రకారం చైర్మన్, సభ్యుల కాలపరిమితి పెంచే అవకాశం లేకపోవడంతో కొత్త నియామకాలు అనివార్యం కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుత కమిషన్‌లో ఈనెల 17 తర్వాత మిగిలే ఇద్దరు సభ్యుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఒకరి, అక్టోబర్‌లో మరొకరి పదవీ కాలం ముగుస్తుంది. దీనితో కొత్త చైర్మన్ ఎంపిక అనివార్యం అయింది..

Tags :
|
|
|

Advertisement