Advertisement

  • తెలంగాణ జిల్లాలలో వేగంగా కొనసాగుతున్న ఇండ్ల నమోదు ప్రక్రియ

తెలంగాణ జిల్లాలలో వేగంగా కొనసాగుతున్న ఇండ్ల నమోదు ప్రక్రియ

By: Sankar Fri, 09 Oct 2020 06:53 AM

తెలంగాణ జిల్లాలలో వేగంగా కొనసాగుతున్న ఇండ్ల నమోదు ప్రక్రియ


గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షలకుపైగా ఇండ్లు రికార్డుల్లోకి ఎక్కాయి. వీటన్నింటినీ టీఎస్‌ ఎన్‌పీబీ యాప్‌లోకి ఎక్కించి ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. మొదట ఈ-పంచాయతీ పోర్టల్‌లోకి ఎక్కించి.. ఆ తర్వాత యాప్‌లో ఫొటోలు, ఇతర వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల గృహాలు పోర్టల్‌లో నమోదవగా, గురువారం నాటికి 13.14 లక్షల ఇండ్లను యాప్‌లో ఆన్‌లైన్‌ చేశారు. ఈ నెల మూడో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌లో రోజుకు సగటున 2 లక్షలకు పైగా ఇండ్లను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శికి రోజుకు 50 ఇండ్లు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించగా..

ఒక్కొక్కరు సగటున 30 నుంచి 35 ఇండ్ల వివరాలు సేకరిస్తున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. మొన్నటి వరకు యాప్‌లో సాంకేతిక సమస్యలు, కొన్ని అంశాల్లో స్పష్టత లేక ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటిని పరిష్కరించి, ఒక్కో కార్యదర్శి రోజుకు 50 నుంచి 70 ఇండ్లను ఆన్‌లైన్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు.

Tags :
|

Advertisement