Advertisement

TSBIE ఇంటర్ రీకౌంటింగ్ వివరాలను వెల్లడించింది.

By: chandrasekar Fri, 19 June 2020 2:08 PM

TSBIE ఇంటర్ రీకౌంటింగ్ వివరాలను వెల్లడించింది.


తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చినా తక్కువ మార్కుల తేడాతో ఫెయిల్ ఐనా మరోసారి మీ ఆన్సర్ బుక్‌లెట్ రీకౌంటింగ్ చేయించాలనుకున్న వారికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE రీకౌంటింగ్ వివరాలను వెల్లడించింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయొచ్చు. అంతేకాదు.

మీ ఆన్సర్ షీట్ స్కాన్డ్ కాపీని కూడా పొందొచ్చు. రీవెరిఫికేషన్ చేయించొచ్చు. ఇందుకోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్‌ అయితే ఒక పేపర్‌కు రూ.100 చొప్పున, ఆన్సర్ బుక్‌లెట్ స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్‌కు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ చేయించాలనుకునే సబ్జెక్ట్‌ను వెల్లడించాలి. పూర్తి అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తెలపాలి.

మీ దరఖాస్తును ప్రిన్సిపాల్ ద్వారా లేదా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేన్ ఆఫీసర్ కార్యాలయం ద్వారా లేదా వ్యక్తిగతంగా లేదా డీడీ తీసి పోస్టు ద్వారా పంపొచ్చు. విద్యార్థులు తమ జవాబు పత్రాలకు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇతర విద్యార్థుల జవాబు పత్రాల కోసం దరఖాస్తు చేయడం నేరం. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 24 చివరి తేదీ. ఆ తర్వాత రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ప్రక్రియ నిలిపివేస్తుంది ఇంటర్ బోర్డు. చివరి తేదీ పొడిగింపు కూడా ఉండదు.

Tags :
|

Advertisement