Advertisement

  • సామజిక కార్యకర్త తృప్తి దేశాయిపై ఆంక్షలు విధించిన షిరిడీ అధికారులు

సామజిక కార్యకర్త తృప్తి దేశాయిపై ఆంక్షలు విధించిన షిరిడీ అధికారులు

By: Sankar Wed, 09 Dec 2020 4:53 PM

సామజిక కార్యకర్త తృప్తి దేశాయిపై ఆంక్షలు విధించిన షిరిడీ అధికారులు


షిరిడీ వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులలో రావాలని షిరిడి ట్రస్ట్ భక్తులను కోరిన విషయం తెలిసిందే..వీటిపై సామజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు ఆ పోస్టర్లను తొలగించాలని.. లేకపోతే తానే ఇతర కార్యకర్తలతో డిసెంబర్ 10న ఆలయం వద్దకు చేరుకుని వాటిని తొలగిస్తానని తృప్తి దేశాయ్‌ హెచ్చరించారు...

ఇక దీనితో ఆమెపై షిర్డీ అధికారులు అంక్షలు విధించారు. డిసెంబర్ 8 నుంచి 11 అర్ధరాత్రి వరకు తృప్తి దేశాయ్‌కు షిర్డీ ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గోవింద్ షిండే నోటీసులు జారీ చేశారు. తృప్తి దేశాయ్ ఆలయంలోకి ప్రవేశిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు.

షిర్డీతో పాటు దాని పక్కనే ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలో కూడా ఆమె ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఆమె తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆలయంలోకి ప్రవేశించడానికి చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు

Tags :
|

Advertisement