Advertisement

  • టిక్ టాక్ కు అమెరికాలో కూడా ఎదురుదెబ్బ ..ఆదివారం నుంచి బంద్

టిక్ టాక్ కు అమెరికాలో కూడా ఎదురుదెబ్బ ..ఆదివారం నుంచి బంద్

By: Sankar Fri, 18 Sept 2020 8:25 PM

టిక్ టాక్ కు అమెరికాలో కూడా ఎదురుదెబ్బ ..ఆదివారం నుంచి బంద్

ఇండియాలో నిషేదానికి గురి అయిన టిక్ టాక్ కు అమెరికాలో కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. టిక్‌టాక్‌, వీచాట్‌పై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఆదివారం నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని, ఇకపై ఎవరూ ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసే వీల్లేదని పేర్కొంది. ఈ మేరకు కామర్స్‌ సెక్రటరీ విల్బర్‌ రోస్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలకు చెందిన ఈ యాప్‌లను ఉపయోగించడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం తదితర అంశాలపై ప్రభావం చూపుతాయనే కారణంగా వీటిని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అమెరికా- చైనాల మధ్య దౌత్య, వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో డ్రాగన్‌ దేశ యాప్‌లు, కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు అగ్రరాజ్యం సిద్ధమైన సంగతి తెలిసిందే..

ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు విక్రయించాలని, లేనిపక్షంలో దాన్ని నిషేధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే హెచ్చరించారు. దీంతో ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు తొలుత మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా చర్చలు ఫలించలేదు. దీంతో ఒరాకిల్‌ రంగంలోకి దిగింది. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరిపింది. అయితే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించేందుకు తాను సిద్దంగా లేనని ట్రంప్ వెల్లడించారు

Tags :
|
|
|

Advertisement