Advertisement

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనున్న ట్రంప్..?.

By: chandrasekar Mon, 14 Dec 2020 8:50 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనున్న ట్రంప్..?.


అమెరికాలో ఈరోజు నుంచి ఫైజర్‌ కరోనా వాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభ౦ కానున్నది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పెన్స్‌లు త్వరలో వ్యాక్సిన్‌ వేసుకోనున్నారని అధికార వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే కరోనా బారినపడి, కోలుకున్న ట్రంప్‌ టీకా వెంటనే తీసుకుంటారా అనే విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారవర్గాలు. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగించడానికి యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అడ్వైజరీ ప్యానల్‌ శనివారం అనుమతించిన విషయం తెలిసిందే.

వైట్‌హౌస్‌ సిబ్బందికి, అత్యున్నత ప్రభుత్వాధికారులు కూడా రానున్న పది రోజుల్లో టీకా తీసుకుంటారని పేర్కొన్నాయి. అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు వ్యాక్సిన్‌ తీసుకునే విషయం ఇంకా తెలియలేదని తెలిపాయి. ఆరోగ్య కార్యకర్తలు, సీనియర్‌ సిటిజన్లకు సరిపడినంత వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామని అధికారులు ప్రకటించారు. దేశంలో ఇప్పటివకు కరోనా వల్ల 2,98,000 మంది మరణించారు. దేశంలోని 145 ప్రాంతాలకు ఇప్పటికే వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

Tags :
|
|
|

Advertisement