Advertisement

  • న్యాయపరంగా నేను గెలిచాను...అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ వ్యాఖ్యలు

న్యాయపరంగా నేను గెలిచాను...అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ వ్యాఖ్యలు

By: Sankar Fri, 06 Nov 2020 09:06 AM

న్యాయపరంగా నేను గెలిచాను...అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ వ్యాఖ్యలు


అగ్రరాజ్యం ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వైట్‌హౌస్‌కి చేరేది ఎవరో తేలడానికి కేవలం ఆరు ఓట్ల దూరం మాత్రమే ఉంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో జో బైడెన్‌ 264 ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 214 దగ్గర ఆగిపోయారు. బైడెన్‌ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది.

ఇక ట్రంప్‌ గెలవాలంటే నిజంగానే ఏదైనా అద్భుతం జరగాలి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా తాను గెలిచానని ప్రకటించారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో మీడియా, టెక్‌ సంస్థల జోక్యం భారీగా ఉందని ఆరోపించారు. నిర్ణయాత్మకంగా ఇప్పటికే తాను గెలిచాను అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఒకవేళ చట్టపరమైన ఓట్లను కౌంట్‌ చేస్తే నేను చాలా సులభంగా గెలుస్తాను.

కానీ వారు మమ్మల్ని ఓడించడానికి అక్రమ ఓట్లను ఉపయోగించారు’ అని ఆరోపించారు. ఇక మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తుందని మండి పడ్డారు. బ్లూ వేవ్‌ వచ్చింది అంటూ జనాలను గందరగోళంలో పడేసింది అన్నారు. కానీ డెమొక్రాట్లు మాత్రం మీడియా అంచానలను నిజం చేయలేకపోయారని.. తాను న్యాయంగా ఎన్నికల్లో విజయం సాధించానని అన్నారు ట్రంప్‌...

Tags :
|
|
|
|

Advertisement