Advertisement

  • ఓట‌మి నుంచి త‌ప్పించుకునేందుకు ట్రంప్ ప్రయత్నం...

ఓట‌మి నుంచి త‌ప్పించుకునేందుకు ట్రంప్ ప్రయత్నం...

By: chandrasekar Tue, 03 Nov 2020 9:40 PM

ఓట‌మి నుంచి త‌ప్పించుకునేందుకు ట్రంప్ ప్రయత్నం...


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఇటీవ‌ల రెండోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వారిలో సీనియ‌ర్ జార్జ్ బుష్ ఉన్నారు.

1992లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ నేత జార్జ్ హెర్బ‌ర్ట్ వాక‌ర్ బుష్‌.. రెండ‌వ సారి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు.

అటువంటి ఓట‌మి నుంచి త‌ప్పించుకునేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే అమెరికాలో ఎల‌క్ష‌న్ డే ఓటింగ్ ప్రారంభ‌మైంది.

గ‌త కొన్ని రోజుల నుంచి తీవ్ర ప్ర‌చారంలో పాల్గొన్న ట్రంప్‌, బైడెన్‌లు ఇద్ద‌రూ ప్ర‌స్తుతం త‌మ త‌మ స్వంత ప్ర‌దేశాల‌కు వెళ్లారు.

సోమ‌వారం నాలుగు రాష్ట్రాల్లో 5 చోట్ల ప్ర‌చారం నిర్వ‌హించిన అధ్య‌క్షుడు ట్రంప్‌ వాషింగ్ట‌న్ చేరుకున్నారు. తుది ఫ‌లితాలు వెలుబ‌డే వ‌ర‌కు ఆయ‌న వైట్‌హౌజ్‌లోనే ఉండ‌నున్నారు.

ఇక ఆయ‌న ప్ర‌త్య‌ర్థి జోసెఫ్ బైడెన్ త‌న స్వంత రాష్ట్రానికి వెళ్లారు. చిన్న‌నాటి రోజులు గ‌డిపిన‌ పెన్సిల్వేనియాలోని స్కారంట‌న్‌కు బెడైన్ వెళ్లారు.

Tags :
|

Advertisement