Advertisement

  • అమెరికా తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన చైనా.. కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్

అమెరికా తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన చైనా.. కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్

By: chandrasekar Thu, 04 June 2020 6:40 PM

అమెరికా తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన చైనా.. కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్


కరోనా వైరస్ తర్వాత ఇరుదేశాల బంధం తీవ్రంగా క్షీణించింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విమానాలను చైనాలోకి అనుమతించని నేపథ్యంలో చైనా విమానాలను కూడా అమెరికాలో అనుమతించబోమని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని విమర్శలు గుప్పించింది. అమెరికా, చైనా మధ్య వివాదం ముదురుతోంది.

అమెరికా నుంచి రాక పోకలు సాగించే అన్ని చైనా విమానాలను నిలిపివేశారు. జూన్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని యూఎస్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

చైనాలోని వుహాన్ సిటిలో ఇప్పటికే లాక్‌డౌన్ ఎత్తేశారు. అక్కడికి ఇతర దేశాల నుంచి విమానాలను అనుమతించినప్పటికీ అమెరికాకు చెందిన యునైటైడ్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థల విమానాలను మాత్రం చైనా అనుమతించలేదు. తమ విమానాలను చైనాలోకి అనుమతించని నేపథ్యంలో చైనా విమానాలను కూడా అమెరికాలో అనుమతించబోమని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Tags :
|

Advertisement