Advertisement

ట్రూకాలర్ యూజర్స్ బి కేర్ఫుల్

By: chandrasekar Thu, 28 May 2020 3:56 PM

ట్రూకాలర్ యూజర్స్ బి కేర్ఫుల్


ట్రూకాలర్ వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రముఖ దిగ్గజ కాలర్ ఐడీ, స్పామ్ ప్రొటెక్షన్ యాప్ ట్రూకాలర్‌లో 4.75 కోట్ల మంది భారతీయ వినియోగదారుల డేటా లీకైందని సైబర్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ ఇంటలిజెన్స్ సంస్థ సైబెల్ తెలిపింది.

హ్యాకర్లు ఆ సమాచారాన్ని రూ.75వేలకు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారని చెప్పింది. 2019 సంవత్సరానికి ముందు ఉన్నసమాచారాన్ని డార్క్‌వెబ్‌లో పెట్టారని పేర్కొంది.

truecaller,users,be,careful,phone ,ట్రూకాలర్, యూజర్స్, బి, కేర్ఫుల్, జాగ్రత్త


అయితే దీనిపై స్పందించిన ట్రూకాలర్ మాత్రం ఇవన్నీ కేవలం ఆరోపణలేనంటూ కొట్టిపడేసింది. మా సర్వర్లు, డేటాబేస్ పటిష్టంగా ఉన్నాయంటూ బదులిచ్చింది.

ఇదిలావుంటే 2019 సంవత్సరంలోనూ ఇలాంటి ఆరోపణలు జోరుగా విన్పించాయి. అయితే అప్పుడు ఏలాంటి సమాచారం ట్రూకాలర్ నుంచి లీక్ కాలేదని తేలిందని గుర్తించేసింది.

Tags :
|
|

Advertisement