Advertisement

  • సాధారణ ఎన్నికల్లోనే టీఆర్ఎస్‌ను గెలిపించారు: మంత్రి సింగిరెడ్డి

సాధారణ ఎన్నికల్లోనే టీఆర్ఎస్‌ను గెలిపించారు: మంత్రి సింగిరెడ్డి

By: chandrasekar Wed, 30 Sept 2020 5:48 PM

సాధారణ ఎన్నికల్లోనే టీఆర్ఎస్‌ను గెలిపించారు: మంత్రి సింగిరెడ్డి


రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి ఉద్యమాలు చేసిన పట్టభద్రులు మాత్రం టీఆర్ఎస్ కే ఓటు వేస్తారని అన్నారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు అవగాహన సదస్సు మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మంత్రి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గత పట్టభద్రుల ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందాం. నాడు వాస్తవాలను ప్రజలకు చేర‌వేయ‌డంలో ఆలస్యం జరిగింది.

బీజేపీ వంద రోజుల్లో ఏదో చేస్తామని నాడు భ్రమ కల్పించింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవాలను ప్రజలకు వివరించాలి. ఓటర్ల నమోదు చేస్తే 90% ఓటింగ్ స‌ర‌ళి తెలుస్తుంది. ప్రతి ఓటు విలువైందే. నాగర్‌కర్నూల్, తాడూరు, బిజినేపల్లి, ప్రాంతాల్లో దాదాపు 3 వేల ఓటర్లను నమోదు చేయించాలి. అక్టోబర్ 1 ను నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ నమోదు ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. హైదరాబాదులో ఓటింగ్ శాతం తక్కువ, మహబూబ్‌నగర్‌లో ఎక్కువ. ఈసారి ఓటర్ల సంఖ్య 30-40% వ‌ర‌కు ఉంటుంది. జనాభాలో ఒక్క శాతానికి మించి ప్రభుత్వ కొలువులు కల్పించలేరు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామంటే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేయించి ఏడాదిన్నర ఆపివేయిస్తే తిరిగి రెగ్యులర్ చేశాం. ఆర్టీసీ, ఇతర శాఖల్లో సైతం రెగ్యులరైజ్‌ చేస్తాం. పోలీసుశాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టు కేసులతోనే ఉద్యోగ నియామకాలు ఆలస్యం జ‌రుగుతుంది. ఐటీలో ఏడున్నర లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇది నిరంతర ప్రక్రియ. చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాఅవగాహన తక్కువ. తెలంగాణ వచ్చాక ప్రతి కుటుంబానికి ఫలితం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

Tags :

Advertisement