Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నిక ...పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కారు జోరు...

దుబ్బాక ఉప ఎన్నిక ...పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కారు జోరు...

By: Sankar Tue, 10 Nov 2020 3:02 PM

దుబ్బాక ఉప ఎన్నిక ...పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కారు జోరు...


సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఇందులో భాగంగా ఉద‌యం 8 గంట‌ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించారు. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1,453 పోల‌వ్వ‌గా, అందులో 1,381 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి.

చెల్లుబాటైన ఓట్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోల‌య్యాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజుకు 60 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. మరో స్వతంత్ర అభ్యర్థి కత్తి కార్తీకకు 15 ఓట్లు పోలవ్వగా, సిలివేరు శ్రీకాంత్ 11 ఓట్లను సాధించారు. ఇక, అభర్థులు ఎవరు రెండు సంఖ్యను కూడా దాటలేకపోయారు. మొత్తం 72 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు తేల్చారు.

ఇక. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతోంది. 18వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 688 ఓట్లు ఆధిక్యం వచ్చింది. 18వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,215, బీజేపీ – 2,527, కాంగ్రెస్- 852 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 174 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇప్పటివరకు బీజేపీకి 50,467, టీఆర్ఎస్‌కు 50,293, కాంగ్రెస్‌కు 17,389 ఓట్లు వచ్చాయి..

Tags :
|
|

Advertisement