Advertisement

హంగ్ దిశగా జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు

By: Sankar Fri, 04 Dec 2020 9:50 PM

హంగ్ దిశగా జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు


గ్రేటర్ ఎన్నికల ఫలితాలు దాదాపు వచ్చేశాయి... ఎవరికి ఎన్ని సీట్లు అనేది తేలిపోయింది... అనూహ్య ఫలితాలతో ఈసారి 'హంగ్' పరిస్థితులే కనిపిస్తున్నాయి. గ్రేటర్ ప్రజలు ఏ పార్టీకి సరయిన మెజారిటీ కట్ట బెట్ట లేదు. టీఆర్ఎస్ 56,బీజేపీ 48,ఎంఐఎం 44,కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకున్నాయి.

మేయర్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 102 ఎవరికీ లేకపోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్‌కు 38 ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు సాధించిన సీట్లతో వాటిని కలుపుకుంటే ఆ పార్టీ బలం 94 మాత్రమే అవుతుంది.

అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు కావాల్సిందే. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందా..? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం సొంతంగా 42 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి 10 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంను మద్దతు కోరచ్చు.

Tags :
|
|

Advertisement