Advertisement

  • దుబ్బాకలో అనూహ్యంగా పుంజుకున్న తెరాస ....నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఫైట్

దుబ్బాకలో అనూహ్యంగా పుంజుకున్న తెరాస ....నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఫైట్

By: Sankar Tue, 10 Nov 2020 2:48 PM

దుబ్బాకలో అనూహ్యంగా పుంజుకున్న తెరాస ....నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఫైట్


దుబ్బాకలో ఒక్కసారిగా తెరాస పుంజుకుంది వరుసగా రౌండ్లు గెలుస్తూ బీజేపీ ఆధిక్యాన్ని వందల్లోకి తగ్గించింది..తాజాగా 17వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 800 ఓట్ల మెజారిటీ సాధించింది. 17 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 934 ఓట్లకు తగ్గింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 2818, బీజేపీకి 1946, కాంగ్రెస్‌కు 1705 ఓట్లు వచ్చాయి.

16వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 750 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3157, బీజేపీకి 2408, కాంగ్రెస్‌కు 674 ఓట్లు దక్కాయి.15వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ మెజారిటీ సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 955 ఓట్ల ఆధిక్యం దక్కింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 3027, బీజేపీ 2072, కాంగ్రెస్‌ పార్టీ 1500 ఓట్లు తెచ్చుకున్నాయి. 15వ రౌండ్‌ ముగిసే సరికి 2483 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం బీజేపీ 41514, టీఆర్‌ఎస్‌ 38,076, కాంగ్రెస్‌ 12658 ఓట్లు సాధించాయి.

ఇక 14వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబరిచింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌ 288 ఓట్ల మెజారిటీ దక్కించుకుంది. టీఆర్‌ఎస్‌కు 2537, బీజేపీకు 2249, కాంగ్రెస్‌ పార్టీకి 784 ఓట్లు వచ్చాయి. 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉంది.దుబ్బా​క ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 13, 14 రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించింది. 13వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 304 ఓట్ల ఆధిక్యం దక్కింది. 13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2824, బీజేపీ 2520, కాంగ్రెస్‌ 1212 ఓట్లు దక్కించుకున్నాయి.


Tags :
|
|
|
|

Advertisement