Advertisement

  • కవిత ఎమ్మెల్సీ గెలుపు కోసం టీఆర్ఎస్ నేతల పక్కా ప్లాన్..,

కవిత ఎమ్మెల్సీ గెలుపు కోసం టీఆర్ఎస్ నేతల పక్కా ప్లాన్..,

By: chandrasekar Thu, 01 Oct 2020 12:08 PM

కవిత ఎమ్మెల్సీ గెలుపు కోసం టీఆర్ఎస్ నేతల పక్కా ప్లాన్..,

తెలంగాణ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు మ‌రో 9 రోజుల స‌మ‌యం ఉండ‌డంతో జోరుగా వ‌ల‌స‌లు జరుగుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల నాటి ఫలితం మళ్లీ ఎదురుకాకుండా జిల్లాకు చెందిన గులాబీ నేతలు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు, ఒక కాంగ్రెస్ కార్పొరేటర్‌ను కారు పార్టీలో చేర్పించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ఉన్న ఇద్దరు జడ్పీటీసీల్లో ఒకరు ఇప్పటికే కారెక్కారు. మరికొంత మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లో చేరేందుకు వరుసలో ఉన్నారు.

టీఆర్ఎస్‌కు ఇప్పటికే పూర్తి ఆధిక్యత ఉన్నా ఎందుకైనా మంచిదని వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో చేర్పించుకుంటున్నారు.ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో మాజీ ఎంపీ క‌విత గెలుపు అత్యంత సులువని అంచనాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ను అక్టోబర్‌ 9న నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉపఎన్నికకు గతంలోనే నోటిఫికేషన్ వచ్చినా కరోనా కారణంగా పోలింగ్ వాయిదా పడింది.

Tags :
|
|

Advertisement