Advertisement

టీఆర్‌ఎస్‌ కీలక నేత బీజేపీ లోకి

By: chandrasekar Thu, 26 Nov 2020 11:53 AM

టీఆర్‌ఎస్‌ కీలక నేత బీజేపీ లోకి


తెలంగాణాన టీఆర్‌ఎస్‌ కీలక నేత బీజేపీ పార్టీ లోకి చేరారు. టీఆర్‌ఎస్‌ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు జేపీ నడ్డా బీజేపీ కండువాను స్వామిగౌడ్‌కు కప్పి బుధవారం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరడమంటే తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆయన పేర్కొన్నారు.

తను ఆత్మాభిమానం కోసం తెలంగాణ ఉద్యమం చేశామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రావడం దురదృష్టకరమని తెలిపారు. స్వరాష్ట్రం వచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమంలో ఒక్కరోజూ కూడా ధర్నా చేయని, జెండా పట్టని ఇతర పార్టీల పెద్దలకు ప్రధాన పదవులు ఇచ్చి టీఆర్‌ఎస్‌ ఉద్యమకారులను దూరం పెట్టిందని స్వామిగౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదని స్వామిగౌడ్ తెలిపారు.

సీఎం కేసీఆర్‌ను కలవడానికి గత రెండేళ్లలో కనీసం 100 సార్లు అపాయింట్‌మెంట్‌ అడిగానని, ప్రతీసారి రేపు కలుద్దామనే సమాచారం వచ్చేదని, తాజాగా వారం క్రితం కూడా అడిగానని ఆవేదన వ్యక్తంచేశారు. పదవుల కోసం బీజేపీలో చేరలేదని, కేవలం ఆత్మాభిమానం కోసం మాత్రమే బీజేపీలో చేరానని స్వామిగౌడ్ స్పష్టంచేశారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అయన అభిప్రాయపడ్డారు.

Tags :
|
|
|
|

Advertisement