Advertisement

  • త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటన: ఉత్తరాఖండ్‌ రెండో రాజధానిగా గైర్‌సైన్‌

త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటన: ఉత్తరాఖండ్‌ రెండో రాజధానిగా గైర్‌సైన్‌

By: chandrasekar Wed, 10 June 2020 12:15 PM

త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటన:  ఉత్తరాఖండ్‌ రెండో రాజధానిగా గైర్‌సైన్‌


ఉత్తరాఖండ్ రాష్ట్ర రెండో రాజధానిగా గైర్‌సైన్‌ని ఏర్పాటు చేస్తూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. చమోలీ జిల్లాలోని గైర్‌సైన్‌ ఇకపై వేసవి రాజధానిగా కొసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు. నగరాన్ని ఆదర్శ పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.

ఈ ఏడాది మార్చి 4న జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర వేసవి రాజధానిగా గైర్‌సైన్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. రాజధాని మార్పునకు గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ఆమోదం తెలపడంతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2017లో జరిగిన ఎన్నికల సందర్భంగా గైర్‌సైన్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తామని భారతీయ జనతాపార్టీ ప్రకటించింది.

Tags :

Advertisement