Advertisement

  • అరుదైన రికార్డు నెలకొల్పిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్

అరుదైన రికార్డు నెలకొల్పిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్

By: chandrasekar Fri, 11 Sept 2020 12:10 PM

అరుదైన రికార్డు నెలకొల్పిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్


వెస్టిండీస్ గడ్డపై ముగిసిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌లో సెయింట్ లూసియా జౌక్స్‌తో తలపడిన నైట్‌రైడర్స్ టీమ్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని నాలుగో సారి టైటిల్‌ని అందుకుంది. తాజా సీజన్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 8 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా అరుదైన రికార్డు నెలకొల్పింది. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జౌక్స్‌ టీమ్ ఆశించిన మేర బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది. ఆండ్రీ ఫ్లెచర్ (39), మార్క్ డేయల్ (29), రోస్టన్ ఛేజ్ (22), నజీబుల్లా (24) నామమాత్రం స్కోరు చేయడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో 154 పరుగులకి ఆలౌటైంది. బౌలింగ్‌లో నైట్‌రైడర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ (4/30) అద్భుత ప్రదర్శనని కనబర్చగా పవాద్ అహ్మద్ (2/22), అలీ ఖాన్ (2/25) అతనికి మంచి సపోర్ట్ ఇచ్చారు.

మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జౌక్స్‌ టీమ్ ఆశించిన మేర బ్యాటింగ్‌లో రాణించలేకపోయింది. ఆండ్రీ ఫ్లెచర్ (39), మార్క్ డేయల్ (29), రోస్టన్ ఛేజ్ (22), నజీబుల్లా (24) నామమాత్రం స్కోరు చేయడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో 154 పరుగులకి ఆలౌటైంది. బౌలింగ్‌లో నైట్‌రైడర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ (4/30) అద్భుత ప్రదర్శనని కనబర్చగా.. పవాద్ అహ్మద్ (2/22), అలీ ఖాన్ (2/25) అతనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. 155 పరుగుల లక్ష్య ఛేదనలో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ టీమ్‌కి ఓపెనర్ సిమన్స్ (84 నాటౌట్: 49 బంతుల్లో 8x4, 4x6) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. వెబ్‌స్టర్ (4), టిమ్ సైఫర్ట్ (4) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా అనంతరం వచ్చిన డారెన్ బ్రావో (58 నాటౌట్: 47 బంతుల్లో 2x4, 6x6) కూడా సిక్సర్లు కొట్టడంతో నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలోనే 157/2తో అలవోక విజయాన్ని అందుకుంది.

Tags :
|
|
|

Advertisement