Advertisement

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ల ట్రయల్స్

By: chandrasekar Wed, 02 Sept 2020 9:35 PM

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ల ట్రయల్స్


కరోనా వైరస్ వల్ల మనుషుల్ని చావడమే కాకుండా, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని చిన్నభిన్నం అవుతున్నాయి. కోట్ల మంది భవిష్యత్తు గందగగోళంలో పడింది. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.58 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 8.6 లక్షలు దాటింది. ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3769523కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 66333కి చేరింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ కావాల్సింది కరోనా వ్యాక్సిన్. ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ను మూడు కంపెనీలు తయారుచేస్తున్నాయి. వాటిలో సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేస్తున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ జరుపుతోంది. ఈ వ్యాక్సిన్ ఒక్క డోస్ వేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఒక్క డోస్ ధర రూ.225గా చెప్పారు. ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

కోవ్యాక్సిన్


ఇక భారత్ భయోటెక్ తయారుచేస్తున్న కోవ్యాక్సిన్ రెండు దశల్లో ట్రయల్స్ జరపాలనుకుంది. మొదటి దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. 14 రోజుల గ్యాప్‌లో రెండు డోసులు ఇవ్వాలంటున్నారు. ధర ఇంకా నిర్ణయించలేదు. ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ రావచ్చంటున్నారు. ఇక జైడస్ కాడిల్లా కూడా రెండు దశలు జరపాలనుకుంది. మొదటి దశ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇది మూడు డోసులు ఇవ్వాలంటున్నారు. ఒక డోస్ ఇచ్చాక 28 రోజులకు రెండో డోస్, 56 రోజులకు మూడో డోస్ ఇవ్వాలంటున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో రావచ్చు. దీని ధర ఇంకా నిర్ణయించలేదు.

ఈ మూడు వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రాజెనెకా ఫార్మా కంపెనీ కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ నమ్మకం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 22 వ్యాక్సిన్ల ట్రయల్స్ మనుషులపై జరుగుతున్నాయి. ఐదు వ్యాక్సిన్లు చివరి దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్లు తయారుచెయ్యడానికి సుమారుగా 18 నెలలు పట్టొచ్చనే అంచనా ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వ్యాక్సినైనా మూడు దశల్లో మనుషులపై ట్రయల్స్ జరపాలని కోరుతోంది. మూడో దశలో 40 వేల మంది దాకా ట్రయల్స్‌లో పాల్గొన వచ్చనే కండీషన్ ఉంది. అంతకంటే ఎక్కువ మంది పాల్గొన కూడదు. మొదటి దశలో మాగ్జిమం 80 మందికి మించి వ్యాక్సిన్ ట్రయల్‌లో పాల్గొనకూడదు.

వ్యాక్సిన్ కరోనాను ఎలా నశింపచేస్తుంది?


మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి అంటే యాంటీ బాడీలు, టీ సెల్స్‌ని వ్యాక్సిన్ ప్రేరేపిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత బాడీలో టీ సెల్స్ మరింత జోరుగా ఉత్పత్తి అవుతాయి. అవి ఇతర వైరస్‌లపై పోరాడతాయి. యుద్ధం జరిగేటప్పుడు పక్క దేశపు సైన్యం కూడా వచ్చి జతకలిస్తే శత్రు దేశంపై పోరాడటం తేలికవుతుంది. ఇదే విధంగా వ్యాక్సిన్ బాడీలోకి ఇవ్వగానే అదనంగా టీసెల్స్ ఉత్పత్తి అవుతాయి. అదనంగా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. అవి కరోనా వైరస్‌ని చంపుతాయి. కరోనా వైరస్ అనేది క్రమంగా బలహీనపడుతోంది. అందువల్ల వ్యాక్సిన్లు ఉత్పత్తయ్యాక దాన్ని ఎదుర్కోవడం మరింత తేలికవుతుంది. వ్యాక్సిన్లు కరోనాపై పనిచేస్తాయా అనే అనుమానం అవసరం లేదంటున్నారు చాలా మంది నిపుణులు. ఎందుకంటే వైరస్ బలహీనపడటం, మనుషుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుండటం వల్ల విజయం మనదే అంటున్నారు. కానీ, వ్యాక్సిన్ తయారయ్యాక దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ప్రపంచ దేశాలకు సమానంగా పంపిణీ చెయ్యడమనేది పెద్ద సవాలు.

Tags :
|

Advertisement