Advertisement

  • క‌రోనా బాధితుల‌కు సాయంగా ఖజానా జువెల‌ర్స్ 3 కోట్ల విరాళం

క‌రోనా బాధితుల‌కు సాయంగా ఖజానా జువెల‌ర్స్ 3 కోట్ల విరాళం

By: chandrasekar Sat, 12 Sept 2020 09:35 AM

క‌రోనా బాధితుల‌కు సాయంగా ఖజానా జువెల‌ర్స్ 3 కోట్ల విరాళం


క‌రోనా బాధితుల‌కు సాయం చేసేందుకు ఖజానా జువెల‌ర్స్ 3 కోట్ల విరాళంగా ప్రభుత్వ నిధికి అంధజేసింది. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా జువెల‌ర్స్ అండ‌గా నిలిచింది. క‌రోనా మ‌హమ్మారిని అంత‌మొందించేందుకు త‌న వంతుగా స‌హ‌కారం అందించింది. పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు చొర‌వ‌తో భారీ విత‌ర‌ణకు ముందుకు వ‌చ్చింది. కేవ‌లం వ్యాపార‌మే కాదు ప్రజల శ్రేయ‌స్సు కూడా ముఖ్యమేనని భావించారు.

ప్రజలకు మేలు కోరి ఖ‌జానా జువెల‌ర్స్ అధినేత కిషోర్ కుమార్ సామాజిక బాధ్యతగా రూ.3 కోట్ల విరాళాన్ని మంత్రి ఎర్రబెల్లి స‌మ‌క్షంలో ఐటీ, పుర‌పాల‌క‌ శాఖ మంత్రి కేటీఆర్ కు హైద‌రాబాద్ లో అంద‌జేశారు. ఈ నిధిని క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌, కరోనా బాధితుల సంరక్షణలో భాగంగా వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్ కు వినియోగించాల‌ని అభ్యర్థించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఖ‌జానా జువెల‌ర్స్ కిషోర్ కుమార్ ఔదార్యాన్ని అభినందించారు. ఇలాంటి సహాయం సంక్షోభ సమయంలో చేయడం ద్వారా కరోనా బాధితులకు మేలు కలుగుతుందని తెలిపారు.

వ్యాపార‌మే వ్యాప‌క‌మైనప్పటికి సామాజిక బాధ్యతతో క‌రోనా బాధితుల‌ను ఆదుకోవాల‌నిభారీ విరాళాన్ని అంద‌జేయ‌డం గొప్ప విషయమన్నారు. ఇలాంటి సంద‌ర్భాల్లో చేసే సాయ‌మేదైనా గొప్పదిగా ఉంటుంద‌న్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ త‌న చిర‌కాల మిత్రుడు త‌ర‌చూ ఇలాంటి స‌హాయాలు చేస్తుంటార‌‌ని తెలిపారు. అయితే ఈసారి క‌రోనా బాధితుల‌కు సాయం చేయ‌డానికి ముందుకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. కిషోర్ కుమార్ మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు స్ఫూర్తితో ఈ విధంగా ముందుకు వ‌చ్చామ‌న్నారు. ఇలా ప్రజల కోసం నిధిని విరాళంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.

Tags :

Advertisement