Advertisement

భారత్‌లో లక్షా 30వేలు దాటిన కరోనా మరణాలు...

By: chandrasekar Mon, 16 Nov 2020 4:52 PM

భారత్‌లో లక్షా 30వేలు దాటిన కరోనా మరణాలు...


భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 30వేలు దాటింది. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే ప్రస్తుతం రెండూ కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఆదివారం దేశ వ్యాప్తంగా కొత్తగా 30, 548 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 435 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,45,127 కి పెరగగా మరణాల సంఖ్య 1,30,070 కి చేరింది.

కరోనా నుంచి నిన్న 43,851 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య దేశంలో 82,49,579 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,65,478 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93 శాతం ఉండగా మరణాల రేటు 1.47 శాతం ఉంది. ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 8,61,706 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకటించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 15వ తేదీ వరకు దేశంలో మొత్తం 12,56,98,525 నమూనాలను పరీక్షించినట్లు ఎసీఎంఆర్ పేర్కొంది.

Tags :
|

Advertisement