Advertisement

  • ట్రాన్స్‌జెండర్ తో పెళ్లి... యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య..!

ట్రాన్స్‌జెండర్ తో పెళ్లి... యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య..!

By: Anji Thu, 01 Oct 2020 6:42 PM

ట్రాన్స్‌జెండర్ తో పెళ్లి... యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య..!

ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్‌జెండర్‌ని పెళ్లి చేసుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాన్స్‌జెండర్‌ డబ్బుల వసూళ్లకు వెళ్లిన సమయంలో యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన కనిగిరి పట్టణ శివారు కాశిరెడ్డి కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన నారాయణ(32) అనే యువకుడు ఓ ట్రాన్స్‌జెండర్‌ని వివాహం చేసుకున్నాడు. కొద్దికాలం బాగానే ఉన్నా.. కుటుంబంలో కలహాలు రేగాయి.

నిత్యం ఇద్దరూ గొడవపడేవారు. మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహం చెందిన నారాయణ బైక్ తగటబెట్టాడు. గమనించిన స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేసి సర్ది చెప్పారు. మరుసటి రోజు ఉదయం ట్రాన్స్‌జెండర్ వసూళ్లకు వెళ్లిపోయింది.

ఆమె తిరిగి వచ్చేప్పటికే నారాయణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే ప్రాణాలు పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Advertisement