Advertisement

  • సౌదీ మహిళలకు ఇక మగవారి డ్రైవింగ్ స్కూల్స్‌లో కూడా ట్రైనింగ్ కు సదుపాయం

సౌదీ మహిళలకు ఇక మగవారి డ్రైవింగ్ స్కూల్స్‌లో కూడా ట్రైనింగ్ కు సదుపాయం

By: chandrasekar Wed, 11 Nov 2020 09:55 AM

సౌదీ మహిళలకు ఇక మగవారి డ్రైవింగ్ స్కూల్స్‌లో కూడా ట్రైనింగ్ కు సదుపాయం


అరబ్ దేశాలలో మహిళలకు అనేక కట్టుబాట్లు వున్నాయి. ప్రస్తుతం వీరికి ఒక్కొక్కటిగా వెసులు బాట్లు కల్పిస్తున్నారు. సౌదీ అరేబియా సర్కారు మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మహిళల కోసం దేశవ్యాప్తంగా మరిన్ని డ్రైవింగ్ స్కూల్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మగవారి డ్రైవింగ్ స్కూల్స్‌లో ఇకపై మహిళలకు కూడా అవకాశం కల్పించనున్నట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే మహిళా ట్రైనర్స్ పర్యవేక్షణలో మాత్రమే వీరికి డ్రైవింగ్ శిక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక, 2017లో మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించిన సౌదీ ప్రభుత్వం 2018 జూన్ 24 నుంచి వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం ప్రారంభించింది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం సౌదీ ప్రభుత్వం 2020 జనవరి నాటికి 1,74,624 మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసినట్లు వెల్లడైంది. వీటిలో రియాద్ లో అత్యధికంగా 47.7 శాతం మందికి లైసెన్స్ జారీతో మొదటి స్థానంలో ఉంటే, తూర్పు ప్రావిన్స్‌లో 27.9 శాతం, మక్కాలో 14.4 శాతంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ కొరకు వీరు డ్రైవింగ్ స్కూల్స్ లో శిక్షణ పొందుటకు మరింత సౌలబ్యాన్ని సౌదీ ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా 5 మహిళా డ్రైవింగ్ స్కూల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా, తబుక్‌లో ఈ డ్రైవింగ్ స్కూల్స్ నడుస్తున్నాయి. తాజాగా సౌదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో మరిన్ని డ్రైవింగ్ స్కూల్స్ విస్తరించే అవకాశముంది. దీంతో మరింత మంది మహిళలకు డ్రైవింగ్ నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. సౌదీ అరేబియా సర్కార్ నిర్ణయం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే 21వ శతాబ్దంలో మహిళల డ్రైవింగ్‌కు ఇప్పడు అవకాశం ఇవ్వడమేంటనే ఆలోచన రావొచ్చు. అయితే కొన్ని అరబ్ దేశాల్లోని మహిళలు ఇప్పటికీ కట్టుబాట్ల వలయంలో చిక్కుకుపోయారు. మహిళలు తమ హక్కుల కోసం కూడా అడగలేని పరిస్థితి అక్కడ వుంది. అయితే ఇప్పుడిప్పుడే మహిళల హక్కుల విషయంలో కాస్త మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags :
|
|

Advertisement