Advertisement

  • మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట్లో విషాదం..

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట్లో విషాదం..

By: chandrasekar Thu, 17 Sept 2020 12:29 PM

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట్లో విషాదం..


గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట విషాదం చోటుచేసుకుంది. బిల్ గేట్స్ నాన్న చనిపోయారు. ఈ విషయాన్ని కుటుంబమే వెల్లడించింది. ఈయన పేరు విలియన్ హెచ్ గేట్స్ 2. న్యాయవాదిగా, దాతృత్వపరుడిగా కన్నా బిల్ గేట్స్ తండ్రిగానే ఈయనకు ఎక్కువ గుర్తింపు లభించింది. విలియమ్ హెచ్ గేట్స్ 2 సోమవారం వాషింగ్టన్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఈయన వయసు 94 ఏళ్లు. అల్జీమర్స్ వ్యాధి కారణంగా ఈయన మరణించారు. విలియన్ హెచ్ గేట్స్ మరణాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్యం లక్ష్యంగా ఏర్పాటైన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపనకు ఈయన చేసి కృషి ఎవ్వరూ మరువలేరని చెప్పుకోవచ్చు.

బిల్ గేట్స్ నాన్న మరణాన్ని తట్టుకోలేక ఆయనను తలచుకుంటూ ఒక ట్వీట్ చేశారు. ‘మా నాన్న నిజమైన బిల్ గేట్స్. ఇప్పుడు ఆయనను ప్రతి రోజు మిస్ అవుతా’ అని భావోద్వేగమైన ట్వీట్ చేశారు. ఇకపోతే విలియం హెచ్ గేట్స్‌ 2 నవంబర్ 30 1925న వాషింగ్టన్‌లోని బ్రెమెర్టన్‌లో జన్మించారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. తర్వాత సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించారు. ఆపైన ఆర్మీ నుంచి బయటకు వచ్చి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగం చేసిన ఈయన ప్రిస్టన్ గేట్స్, ఎలిస్ లా సంస్థలను ఏర్పాటు చేశారు.

Tags :

Advertisement