Advertisement

  • ఎల్బీ నగర్ లో రేపు సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ ..

ఎల్బీ నగర్ లో రేపు సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ ..

By: Sankar Fri, 27 Nov 2020 8:08 PM

ఎల్బీ నగర్ లో రేపు సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ ..


జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకుంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో భారీ బహిరంగ సభ జరగబోతున్నది.

దీంతో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రాబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎల్బీ స్టేడియం వద్ద వాహనాలకు ఎంట్రీ ఉండదు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలకు పబ్లిక్ గార్డెన్స్, రవీంద్రభారతి, డాక్టర్ కార్స్ ప్రాంతంలో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు.

అదే విధంగా, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, పాతబస్తీ నుంచి వచ్చే వాహనాల కోసం పీపుల్స్ ప్లాజా వద్ద పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. ఇక ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలకు నిజాం కాలేజీలో పార్కింగ్ ఏర్పాటు చేయగా, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలకు నిజాం కాలేజీ గ్రౌండ్ లో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు.

Tags :
|

Advertisement