Advertisement

  • జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరనుంది...స్టీల్‌ వంతెన ప్రారంభం

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరనుంది...స్టీల్‌ వంతెన ప్రారంభం

By: chandrasekar Sat, 20 June 2020 5:06 PM

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరనుంది...స్టీల్‌ వంతెన ప్రారంభం


నగరంలోని పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ స్టీల్ గేట్ అందుబాటులోకి రావడంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎల్వీ ప్రసాద్ మీదుగా పంజాగుట్ట వచ్చే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. స్మశానంపై జీహెచ్ఎంసీ మొట్టమొదటిసారి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది.

లాక్‌డౌన్ సమయంలో అత్యంత వేగవంతంగా పనులు చేపట్టి ఈ ప్రాజెక్టును త్వరగా జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చేందుకు మరో వంతెన సిద్ధమైంది.

ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు లాక్‌డౌన్ సమయంలోనూ కొనసాగించినట్లు హోంమంత్రి మహూద్ అలీ తెలిపారు. రూ. 6 కోట్లతో బల్దియా నిధులతో పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ వంతెనపై నేటి నుంచే రాకపోకలు సాగనుండటంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరనుంది.

ఈ వంతెన నిర్మాణం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్గో సేవలు తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించింది. ఆర్టీసీకి అదనపు ఆదాయం కలిగించేందుకు పార్సిల్, కార్గో, కొరియర్ సేవలను ప్రారంభించినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో కార్గో సేవలను .మంత్రి శుక్రవారం ప్రారంభించారు.

తొలి విడతగా 140 బస్టాండ్లలో కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని పువ్వాడ అజయ్ తెలిపారు. గతంలో ప్రైవేటు సంస్థల ద్వారా కార్గో, పార్సిల్ సేవలు నడిచేవని ప్రస్తుతం ఆ టెండర్లు రద్దు చేశామన్నారు. త్వరలో కార్గో సేవలకు సంబంధించి మొబైల్ యాప్ కూడా తీసుకొస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు.

Tags :
|

Advertisement