Advertisement

  • ఉస్మానియా ఆసుపత్రికోసం కెసిఆర్ ప్రభుత్వం ఏడు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ..ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉస్మానియా ఆసుపత్రికోసం కెసిఆర్ ప్రభుత్వం ఏడు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ..ఉత్తమ్ కుమార్ రెడ్డి

By: Sankar Sat, 25 July 2020 7:36 PM

ఉస్మానియా ఆసుపత్రికోసం కెసిఆర్ ప్రభుత్వం ఏడు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ..ఉత్తమ్ కుమార్ రెడ్డి



టీఆర్ఎస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియా ఆస్పత్రిని పట్టించుకోవడం మానేసిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లలో ఉస్మానియా కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.ఏడు కూడా ఖ‌ర్చు చేయ‌లేదని విమర్శించారు. శ‌నివారం కాంగ్రెస్ నేత‌లు ఉస్మానియా ఆసుప‌త్రి ప్రధాన భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. ఉస్మానియా భవనాన్ని పరిరక్షించాలని, భవన మౌలిక స్వరూపం బాగానే ఉందని నిపుణుల చెబుతున్నారని తెలిపారు. నిజాం గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే కేసీఆర్ ఆయన కట్టిన భవనాన్ని ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు. నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేయాలని, అవసరమైతే దీన్ని మ్యూజియం చేయాల‌ని సూచించారు..

ఇదే ప్రాంగణంలో 6 ఎకరాల ఖాళీ స్థలం ఉందని, అందులో కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఉత్తమ్ అన్నారు. ప్రజారోగ్యం పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి అవుతుందని తెలిసి కూడా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవ‌టం లేద‌ని ఉత్తమ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరడానికి కేసీఆర్ అసమర్థతే కారణమని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.

Tags :
|
|
|
|

Advertisement