Advertisement

  • మోడీ రాకపోతే కరోనా వ్యాక్సిన్ తయారీ ఆగిపోతుందా ...టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

మోడీ రాకపోతే కరోనా వ్యాక్సిన్ తయారీ ఆగిపోతుందా ...టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

By: Sankar Mon, 30 Nov 2020 05:20 AM

మోడీ రాకపోతే కరోనా వ్యాక్సిన్ తయారీ ఆగిపోతుందా ...టీపీసీసీ చీఫ్ ఉత్తమ్


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్‌ ప్రజలను అవమానపరిచే విధంగా వ్యవహరించిందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్‌లో వరదలు వచ్చి వంద మంది చనిపోతే కనీసం పరామర్శకు రాని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా... ఓట్ల కోసం వచ్చి షోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వ్యాక్సిన్‌ పరిశీలన పేరుతో మోదీ హైదరాబాద్‌కు రావడం కూడా డ్రామాయేనని దుయ్యబట్టారు.

మోదీ రాకపోతే కరోనా వ్యాక్సిన్‌ తయారీ ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి జె. గీతారెడ్డి తదితరులతో కలసి ఉత్తమ్‌ మాట్లాడారు.కేవలం ఒకే ఒక్క కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బీజేపీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం అవసరమా? అని ఉత్తమప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో దళితులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నివారించలేని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌... హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారానికి రావడం విడ్డూరంగా ఉందన్నారు

Tags :
|
|
|

Advertisement