Advertisement

  • మోడీ అధికారంలోకి రాకముందు ఇండో- చైనా బోర్డర్ లో ఒక్క సైనికుడి ప్రాణం కూడా పోలేదు ..ఉత్తమ్ కుమార్ రెడ్డి

మోడీ అధికారంలోకి రాకముందు ఇండో- చైనా బోర్డర్ లో ఒక్క సైనికుడి ప్రాణం కూడా పోలేదు ..ఉత్తమ్ కుమార్ రెడ్డి

By: Sankar Fri, 26 June 2020 3:47 PM

మోడీ అధికారంలోకి రాకముందు ఇండో- చైనా బోర్డర్ లో ఒక్క సైనికుడి ప్రాణం కూడా పోలేదు ..ఉత్తమ్ కుమార్ రెడ్డి


భారత్ చైనా మధ్య జరిగిన సరిహద్దు వివాదంలో తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మోడీ ప్రభుత్వాన్ని విమర్శించాడు ..విదేశాంగ విధానంలో మోడీ ప్రభుత్వం విఫలం అయింది అని అన్నాడు ..చైనా ఇండియా సంఘర్షణలో ప్రాణాలు విడిచి అమరుడైన కల్నల్ సంతోషుబాబు త్యాగం ఎప్పటికి మరువలేము అని అతడి త్యాగం ఎప్పటికి శాశ్వతంగా నిలిచిపోతుంది అని పేర్కొన్నాడు ..శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 45 ఏళ్ల పాటు ఇండో-చైనా బోర్డర్ లో ఒక్క ప్రాణం కూడా పోలేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో 20 మంది మృతి చెందారన్నారు. ప్రధాని మోదీ పని తీరు ఏంటో దేశం గమనిస్తోందని పేర్కొన్నారు.

మోదీ విదేశీ పర్యటనల వల్ల దేశానికి ప్రయోజనం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా భారత్ తో మిత్ర దేశాలుగా ఉన్న సరిహద్దు దేశాలు- శత్రు దేశాలుగా మారాయని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానంలో కేంద్రం వైఫల్యం చెందిందని విమర్శించారు. చైనా ఆర్మీ ఇండియా సరిహద్దుల్లో నుంచి వెనక్కి వెళ్ళాలని కోరారు. దేశ రక్షణ కోసం ఆర్మీ-నేవీ-త్రివిధ దళాలు చేస్తున్న కృషి పట్ల ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

మరోవైపు దేశం గర్వించదగ్గ నాయకులలో ఒకడైన పీవీ నరసింహారావు యొక్క శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాము అని పేర్కొన్నాడు ..అంతేకాకుండా 28వ తేదీన పీవీ జయంతి వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తల గుండెల్లో ఉంటారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.దేశంలో అనేక సంస్కరనలను ప్రవేశ పెట్టి చిరస్మరనీయుడిగా మిగిలాడు అని ఉత్తమ్ అన్నాడు ..

Tags :

Advertisement