Advertisement

దేశం లో ఒక్కరోజు లో 7230 కరోనా కేసులు

By: chandrasekar Fri, 29 May 2020 5:31 PM

దేశం లో ఒక్కరోజు లో 7230 కరోనా కేసులు


భారతదేశం లో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. పది రోజులుగా ఆరున్నర వేల కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 7,230 మందికి పాజిటివ్ రాగా 176 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 65 వేలు దాటగా 4,710 మంది చనిపోయారు.

తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలనూ కరోనా ఆగమాగం చేస్తోంది. వందల సంఖ్యలో కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గురువారం ఒక్కరోజే రెండున్నర వేలకుపైగా కొత్త కేసులు, 85 మరణాలు నమోదుకాగా మొత్తం కేసులు 60 వేలకు చేరువయ్యాయి.

totally,corona,cases,single,day ,దేశం లో, ఒక్కరోజు, 7230 కరోనా, కేసులు, భారతదేశం


ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం ఆరు రాష్ట్రాల్లో వందకుపైగా, 3 రాష్ట్రాల్లో 200కుపైగా, మరో ఆరు రాష్ట్రాల్లో 300కుపైగా కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి.

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనుకున్న కేరళలోనూ కొత్తగా 84 మందికి పాజిటివ్ కేసులు వచ్చింది. మొత్తంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|
|

Advertisement